గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 21 జులై 2023 (21:45 IST)

వివేకా హత్య కేసు : బాబాయ్ ఇకలేరని జగన్ నిలబడే మాకు చెప్పారు : అజేయ కల్లాం వాంగ్మూలం

ajeya kallam
మాజీ మంత్రి, వైకాపా నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ తయారు చేసిన చార్జిషీటులో పేర్కొన్న అంశాలు ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ కేసులో 259వ సాక్షిగా వాంగ్మూలం ఇచ్చిన సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల.. తన చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్యకు రాజకీయ కారణాలై ఉండొన్ని, ఆర్థిక వ్యవహారాలు కాకపోవచ్చని పేర్కొన్నారు. 
 
ఇపుడు మరో సాక్షి ఇచ్చిన వాంగ్మూలం వెలుగులోకి వచ్చింది. ఆ సాక్షి పేరు ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లాం రెడ్డి. ఈ హత్య కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అయిన అజేయ కల్లాంను ఒక సాక్షిగా పేర్కొంది. ఆయన వాంగ్మూలాన్ని కూడా సీబీఐ రికార్డు చేసింది. ఈ నేపథ్యంలో అజేయ కల్లాం వాంగ్మూలం వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. 
 
"హైదరాబాద్ లోటస్ పాండ్‌లో ఉండగా, ఉదయం 5.30 గంటలకు జగన్ అటెండర్ తలుపు కొట్టారు. వైఎస్ భారతి మేడపైకి రమ్మంటున్నారని ఆ అటెండర్ జగన్‌కు చెప్పారు. బయటకి వెళ్లిన 10 నిమిషాల తర్వాత జగన్ మళ్లీ వచ్చారు. బాబాయ్ ఇకలేరని జగన్ నిలబడే మాకు చెప్పారు అని వివరించారు.
 
కాగా, ఈకేసులో సీబీఐ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, జగన్ అటెండర్ గోపరాజు నవీన్, ప్రస్తుత వైకాపా ఎమ్మెల్సీ, నాటి వైకాపా మేనిఫెస్టో రూపకల్పన ఛైర్మన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రిటైర్డ్ ఐఏఎస్ అజేయ కల్లాంను సాక్షులుగా పేర్కొనగా, వీరిలో అజేయ కల్లాం సాక్ష్యం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. కాగా గత 2015 మార్చి 15వ తేదీన లోటస్‌పాండ్‌‍లో ఉన్నట్టు సాక్షులు తమ వాంగ్మూలంలో చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోపై చర్చించేందుకు వేకువజామునే సమావేశమైనట్టు తెలిపారు.