ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 25 నవంబరు 2016 (12:16 IST)

లోక్‌సభలో కలకలం : బీజేపీ ఎంపీ పాస్‌పై వచ్చి ఎంపీలకు ముచ్చెమటలు పట్టించాడు...

లోక్‌సభలో కొద్దిసేపు కలకలం చెలరేగింది. ఓ యువకుడు చేసిన పనితో సభలోని ఎంపీలకు ముచ్చెమటలు పట్టాయి. బీజేపీకి చెందిన ఓంపీ పాసుపై వచ్చిన ఈ యువకుడు సందర్శకుల గ్యాలెరీ నుంచి కిందికి దూకేందుకు ప్రయత్నించాడు. ఈ

లోక్‌సభలో కొద్దిసేపు కలకలం చెలరేగింది. ఓ యువకుడు చేసిన పనితో సభలోని ఎంపీలకు ముచ్చెమటలు పట్టాయి. బీజేపీకి చెందిన ఓంపీ పాసుపై వచ్చిన ఈ యువకుడు సందర్శకుల గ్యాలెరీ నుంచి కిందికి దూకేందుకు ప్రయత్నించాడు. ఈ దృశ్యాలను చూసిన మార్షల్స్, భద్రతా సిబ్బంది తక్షణం అప్రమత్తమై ఆ యువకుడిని అదుపులోకి తీసుకోవడంతో సభ్యులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకు 
 
పార్లమెంట్ ఉభయసభలను నోట్ల రద్దు అంశం కుదిపేస్తున్న విషయం తెల్సిందే. శుక్రవారం కూడా లోక్‌సభలో వాడీవేడిగా చర్చ జరుగుతున్న సమయంలో ఒక అనుకోని సంఘటన జరిగింది. ఇది కలకలం రేపింది. సందర్శకుల గ్యాలెరీ నుంచి ఓ యువకుడు కిందికి దూకే ప్రయత్నం చేశాడు. ఇది సభలో ఉన్న అందరినీ కలవరపాటుకు గురి చేశాడు. ఆ యువకుడు ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. 
 
అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. మార్షల్స్ ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. యువకుడి నినాదాలతో సభ వాయిదా పడింది. పార్లమెంట్‌లో ఇలాంటి ఘటన జరగడం బహుశా ఇదే తొలిసారి అయ్యుండొచ్చని సభ్యులు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా ఈ ఘటన సభ్యులకు ముచ్చెమటలు పట్టించింది. సభ జరుగుతున్న సమయంలో విజిటర్స్ వచ్చేందుకు ఇక నుంచి నిబంధనలు కఠినతరం చేసే అవకాశముంది.