శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By TJ
Last Modified: సోమవారం, 10 జులై 2017 (14:21 IST)

మా ఇళ్ల మధ్య నుంచి మద్యం దుకాణాలు ఎత్తేస్తే ఊరుకోం... మహిళల ధర్నా... ఎక్కడ?

మద్యం దుకాణాలను నివాస ప్రాంతాల నుంచి తరలించాలని మహిళలు ఆందోళనలకు దిగడం సర్వసాధారణం. తమిళనాడులో తిరుపూర్ జిల్లాలో ఇందుకు విరుద్ధమైన ఘటన జరిగింది. గ్రామంలోని మద్యం దుకాణాన్ని రద్దు చేయాలనే అధికారుల నిర్ణయంపై తనీర్ పండాల్ గ్రామానికి చెందిన మహిళలు నిరసన

మద్యం దుకాణాలను నివాస ప్రాంతాల నుంచి తరలించాలని మహిళలు ఆందోళనలకు దిగడం సర్వసాధారణం. తమిళనాడులో తిరుపూర్ జిల్లాలో ఇందుకు విరుద్ధమైన ఘటన జరిగింది. గ్రామంలోని మద్యం దుకాణాన్ని రద్దు చేయాలనే అధికారుల నిర్ణయంపై తనీర్ పండాల్ గ్రామానికి చెందిన మహిళలు నిరసన తెలిపారు. 
 
గ్రామంలో ఆ దుకాణం లేకుంటే తమ భర్తలు దూరంగా వున్న మద్యం దుకాణానికి వెళతారని, అలా వెళ్లే సందర్భాల్లో ప్రమాదబారిన పడే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వారు ప్రమాదం బారిన పడకుండా సురక్షితంగా వుండాలంటే గ్రామంలోనే అది ఉండటం మంచిదని కోరారు. కోర్టు ఆదేశాల నేపధ్యంలో రాష్ట్రంలోని మద్యం దుకాణాలను జనావాసాల నుంచి అధికారులు దూరంగా తరలిస్తున్నారు. ఈ నేపధ్యంలోలోనే తాజా ఆందోళన జరగడం గమనార్హం.