శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 29 మే 2020 (08:42 IST)

జూన్‌ 1న కేరళకు నైరుతి రుతుపవనాలు

రాగల 48 గంటల్లో మాల్దీవుల పరిసరాల్లోకి రుతుపవనాలు రానున్నాయని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

తూర్పు అరేబియా సముద్ర ప్రాంతాల్లో ఈ నెల 31న అల్పపీడన ఏర్పడనుందని, దీని ప్రభావంతో జూన్‌ 1న నైరుతి రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉందని తెలిపారు.

అలాగే తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజుల్లో తెలంగాణలో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని సూచించారు.

పలుచోట్ల అత్యధిక ఉషోగ్రతలు కూడా నమోదవుతాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ పలుచోట్ల చిరుజల్లులు, మరికొన్ని చోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు.