పద్మానాభ స్వామి ఆలయంలో 266 కిలోల బంగారం మాయం.. ఆడిట్ లో తేలని లెక్క
అనంత పద్మనాభ స్వామి పేరు చెప్పగానే బంగారు నిధులు.. గుప్త నిధులు దాచిన నేల మాళిగలు గుర్తుకొస్తాయి. వాటిలో భారీ ఎత్తున బంగారం నిల్వ ఉన్న విషయం తెలిసిందే. వాటిని తెరవాలని కోర్టు ఆదేశాలతో బంగారాన్ని వెలికి తీశారు. అయితే అందులో ఇప్పటికే 266 కిలోల బంగారం మాయమైనట్లు ఆడిట్ నివేదికలో పేర్కొన్నారు. దీనిపై ట్రావెల్ కోర్ రాజకుటుంబం ఏమాత్రం స్పందించలేదు. వివరాలిలా ఉన్నాయి.
కేరళలోని తిరువనంతపురం శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో బంగారంపై సంబంధిత రికార్డులను తనిఖీచేసి ఆడిటింగ్ నివేదిక సమర్పించాలని వినోద్‌రాయ్‌ను గత ఏడాది ఏప్రిల్‌లో అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. వినోద్ రాయ్ నివేదికతో బంగారం మాయం కావడానికి కారణమైన వారిని గుర్తించాల్సిన అవసరం ఉన్నదని సీపీఎం ఎమ్మెల్యే వీ శివకుట్టి వ్యాఖ్యానించారు.
ఈ మేరకు వినోద్ రాయ్ రంగంలోకి దిగారు. ఆలయంలోని 893 కిలోల బంగారాన్ని వివిధ పనుల నిమిత్తం బయటకు తీసుకెళ్లగా, తిరిగి 627 కిలోల బంగారం మాత్రమే దేవస్థానానికి చేరుకున్నదని వినోద్‌రాయ్ సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. బంగారులో 266 కిలోల బంగారం ఇంకా ఆలయాన్ని చేరనేలేదు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు సమర్పించిన ఆడిటింగ్ నివేదికలో మాజీ కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ (కాగ్) వినోద్‌రాయ్ ఈ విషయం తెలిపారు.
దేవాలయ నిర్వహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ట్రావెల్‌కోర్ రాజ కుటుంబం రాయ్ నివేదికపై స్పందించలేదు. ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.