ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : మంగళవారం, 25 అక్టోబరు 2016 (12:17 IST)

కోరిక తీర్చలేదని వివాహితపై కత్తితో దాడి చేసిన ఆటో డ్రైవర్... 30 కత్తిపోట్లు..

అరాచకాలకు అడ్డాగా మారిన దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలు అందరూ చూస్తుండగా మహిళను ఓ దుర్మార్గుడు అతికిరాతకంగా హత్య చేశాడు. గుర్గావ్‌లోని ఎంజీ రోడ్ మెట్రో స్టేషన్‌లో సోమవారం ఉదయం

అరాచకాలకు అడ్డాగా మారిన దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలు అందరూ చూస్తుండగా మహిళను ఓ దుర్మార్గుడు అతికిరాతకంగా హత్య చేశాడు. గుర్గావ్‌లోని ఎంజీ రోడ్ మెట్రో స్టేషన్‌లో సోమవారం ఉదయం జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆ వివరాలను పరిశీలిస్తే... షిల్లాంగ్‌కు చెందిన పింకీ దేవి తన భర్త మాన్ సింగ్‌తో మూడేళ్ల క్రితం వీరికి పెళ్లైంది. వీరిద్దరు కలిసి గుర్గావ్‌లోని సార్ హాల్ గ్రామంలో నివసిస్తున్నారు. పింకీ దేవి బ్యూటీ పార్లర్‌లో పనిచేస్తోంది. గత కొన్ని నెలలుగా పింకీ దేవిని జితేందర్ అనే ఆటోడ్రైవర్ వేధిస్తున్నాడు. 
 
ఈనేపథ్యంలో జితేందర్ ఆమెను అత్యంత దారుణంగా పొడిచి చంపాడు. ముందుగా వెనుక నుంచి ఆమెపై జితేందర్ దాడి చేశాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తర్వాత ఆమె గొంతు కోసి, విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడని చెప్పాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిని కత్తితో బెదిరించాడు. పింకీ దేవిని సమీపంలోని ఉమా సంజీవని ఆస్పత్రికి తరలించగా సివిల్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. తీవ్రగాయాలతో మధ్యాహ్నం ఆమె మృతి చెందింది. ఆమె దేహంలో 30 కత్తి గాయాలున్నాయని పోస్టుమార్టం చేసిన వైద్యుడు దీపక్ మాథూర్ వెల్లడించాడు. నిందితుడు ఎందుకు ఈ దారుణానికి ఒడిగట్టాడో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.