1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 24 జూన్ 2016 (11:46 IST)

విదేశీ దుస్తులు ధరిస్తే మంత్రులుగా ఉండరు.. వెయిటర్లుగా కనిపిస్తారు : సుబ్రమణ్య స్వామి

బీజేపీ ఎంపీ డాక్టర్ సుబ్రమణ్య స్వామి ఈ దఫా కేంద్ర మంత్రులను లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు. మొన్న ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్, నిన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఇపుడు కేంద్ర మంత్రులను లక్ష్యంగా తన ట్విట్టర్ ఖాతాలో విమర్శనాస్త్రాలు సంధించారు. 
 
మంత్రులు విదేశీ ప‌ర్య‌ట‌న‌లో టై, కోట్ ధ‌రించ‌వ‌ద్ద‌ని భార‌తీయ సంప్ర‌దాయాన్ని చాటే దుస్తులు మాత్ర‌మే ధ‌రించాల‌ని ఆయ‌న ట్విట్ట‌ర్‌లో ట్వీట్ చేశారు. బీజేపీ ఈ అంశంపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న సూచించారు. మంత్రులు మ‌న సంప్ర‌దాయ దుస్తుల్లో కాకుండా విదేశీ దుస్తుల్లో క‌నిపిస్తే వారు వెయిట‌ర్ల‌లా ఉంటున్నార‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు.