ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 25 ఆగస్టు 2020 (16:36 IST)

ఈ జాతీయ క్రీడాదినోత్సవాన, బాదములతో మీ ఫిట్‌నెస్‌ ప్రయాణాన్ని భర్తీ చేయండి

ప్రతి సంవత్సరం, లెజండరీ క్రీడాకారుడు, మేజర్‌ ధ్యాన్‌చంద్‌ స్మారకంగా మరియు ఆయన గౌరవార్థం మనము జాతీయ క్రీడా దినోత్సావాన్ని నిర్వహిస్తుంటాము. భారతదేశపు అత్యుత్తమ హాకీ క్రీడాకారునిగా ధ్యాన్‌చంద్‌ను ప్రతి ఒక్కరూ గౌరవిస్తుంటారు. క్రీడలు మరియు ఇతర శారీరక వ్యాయామాలు చేయడం ద్వారా భారతీయ యువతకు ఫిట్‌గా మరియు ఆరోగ్యంగా ఉండాల్సిన ఆవశ్యకత పట్ల అవగాహన కల్పించడమే ధ్యేయంగా క్రీడాదినోత్సవం నిర్వహిస్తున్నారు.
 
ఒకరు తమ ఫిట్‌నెస్‌ స్థాయిని నిర్వహించుకోవడంలో కేంద్రీకృత విధానంతో పాటుగా, చక్కటి పౌష్టికాహారం, సమతుల్యమైన డైట్‌, ఆరోగ్యవంతమైన స్నాకింగ్‌ తీసుకోవడం కూడా అవసరం. ఆరోగ్యవంతమైన జీవనశైలికి చక్కటి పౌష్టికాహారం మార్గం వేస్తుంది. దీర్ఘకాల ఆరోగ్యానికి ఇది చిరు పెట్టుబడిగానూ నిలుస్తుంది. దీనిని, అతి చిన్నవైనప్పటికీ, సంబంధిత మరియు ప్రభావవంతమైన మార్పులను డైట్‌కు చేర్చుకోవడం ద్వారా చేరుకోవచ్చు. ఈ మార్పులలో ఓ గుప్పెడు బాదంను తమ ఆహారంలో జోడించడం లాంటివి కూడా ఉంటాయి.
 
ఒకరి క్రీడా షెడ్యూల్‌ను కాంప్లిమెంట్‌ చేస్తూ సరైన ఆహారం తీసుకోవాల్సిన ఆవశ్యకతను రీజనల్‌ హెడ్- డైటిటిక్స్‌, మ్యాక్స్‌హెల్త్‌కేర్‌, ఢిల్లీ, రితికా సమద్ధార్‌ వెల్లడిస్తూ, ‘‘ఓ క్రీడాకారుని ప్రదర్శనపై అతను తీసుకునే ఆహారం, దాని పరిమాణం, ఎంపిక, కూర్పు తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. క్రీడలను ప్రాక్టీస్‌ చేయడం లేదంటే వ్యాయామాలు చేసే వారు సమతుల్యమైన ఆహారం తీసుకోవడం అవసరం. విజయం కోసం బలీయమైన పునాదిని నిర్మించడంలో ఇది ఎంతగానో దోహదపడుతుంది.
 
ఓ గుప్పెడు బాదములు వర్కవుట్‌ తరువాత ఖచ్చితమైన స్నాక్‌గా నిలుస్తాయి. ఇవి శక్తిని అందించడంతో పాటుగా ఆకలినీ తీర్చే గుణాలను కలిగి ఉన్నాయి. అదనంగా, బాదములలో ఆరోగ్యవంతమైన కొవ్వులు సైతం ఉన్నాయి. శరీరానికి ఇవి ఎంతో అవసరం మరియు ప్రొటీన్‌కు చక్కటి వనరుగా కూడా ఇవి సహాయపడతాయి. మీ క్రీడా కార్యక్రమాలు సరిగా చేసేందుకు ఇవి ఎంతగానో సహాయపడతాయి’’ అని అన్నారు.
 
మాధురీ రుయా, పిలాట్స్‌ నిపుణురాలు మరియు డైట్‌, న్యూట్రిషన్‌ కన్సల్టెంట్‌ మాట్లాడుతూ, ‘‘శరీరం వృద్ధి చెందేందుకు, ఆరోగ్యంగా ఉండేందుకు క్రీడలు మరియు శారీరక వ్యాయామాలు తప్పనిసరి. కానీ, మీ శారీరక శిక్షణను మరింత మెరుగ్గా చేసుకునేందుకు సమతుల్యమైన మరియు పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం అవసరం. ఈ ఆహారంలో ఆరోగ్యవంతమైన స్నాక్స్‌ కూడా తప్పనిసరి. మీ రోజువారీ రొటీన్‌ను ఓ గుప్పెడు బాదములను ఆరగించడంతో ప్రారంభించండి. ఇవి పోషకాలతో కూడి ఉండటమే కాదు, మీ గుండె ఆరోగ్యాన్ని సైతం వృద్ధి చేస్తాయి.
 
కింగ్స్‌ కాలేజీ, లండన్‌ ఇటీవలి కాలంలో నిర్వహించిన అధ్యయనంలో,  ప్రతి రోజూ బాదములను తీసుకుంటే అది  ధమనుల యొక్క ఎండోథిలియల్‌ పనితీరును మెరుగుపరుస్తుంది మరియు చెడు ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ను సైతం తగ్గిస్తుంది అని తేలింది. ఇవి రెండూ గుండె ఆరోగ్యానికి అత్యంత కీలకం’’ అని అన్నారు.
 
శారీరక వ్యాయామాలు చేయడంలో సరైన స్నాక్స్‌ తీసుకోవాల్సిన ఆవశ్యకతను గురించి షీలా కృష్ణస్వామి, న్యూట్రిషన్‌ అండ్‌ వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌ మాట్లాడుతూ, ‘‘క్రీడలు మరియు ప్రతి రోజూ వ్యాయామాలు చేయాల్సిన ఆవశ్యకతను గురించి భారతదేశంలో ప్రజలు మెరుగ్గా ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. అదీగాక ఇటీవలి కాలంలో రోగనిరోధక శక్తి పట్ల మరింతగా ఆసక్తి కూడా పెరిగింది. మరీ ముఖ్యంగా ఆహారపరంగా. దీనితో పాటుగా రోగనిరోధక శక్తిని మెరుగుపరిచే ప్రక్రియలను గురించి కూడా చూస్తున్నారు.
 
పరిశోధనలు వెల్లడించే దాని ప్రకారం, ప్రతి రోజూ కొద్దిపాటి తీవ్రమైన వ్యాయామాలు చేయడం వల్ల రోగనిరోధక శక్తి మరింత వృద్ధి చెందుతుంది. మరీ ముఖ్యంగా చిన్నారులకు ఇది మరింత కీలకం. ఎందుకంటే, వారు ఎలాంటి శారీరక వ్యాయామాలూ లేకుండా ఆన్‌లైన్‌ తరగతులకు హాజరవుతున్నారు. తల్లిదండ్రులు వారి కోసం ఓ రొటీన్‌ను ఏర్పాటుచేయడం అవసరం. దీనివల్ల చిన్నారులు కొద్దిపాటి క్రీడలు/ శారీరక వ్యాయామాలను ప్రతి రోజూ చేయగలరు. అంతేకాదు, ఈ రొటీన్‌తో పాటుగా బాదములు లాంటి స్నాక్స్‌ను మీ చిన్నారుల డైట్‌కు జోడించడం కీలకం. బాదములలో జింక్‌, ఫోలేట్‌, ఐరన్‌ మరియు అన్ని పోషకాలూ ఉంటాయి. రోగ నిరోధక శక్తి యొక్క సాధారణ పనితీరుకు ఇవి ఎంతగానో దోహదం చేస్తాయి’’ అని అన్నారు.
 
ఏవైనా క్రీడలు లేదా మరేదైనా ఫిట్‌నెస్‌ రొటీన్‌ నిర్వహిస్తున్నప్పుడు సరైన ఆహారం తీసుకోవడమనేది శరీరానికి తప్పనిసరి. ఈ సంవత్సరం, సరిగా తినడం ద్వారా మీ ఆరోగ్య లక్ష్యాలకు కట్టుబడి ఉండటానికి ప్రతిజ్ఞ చేయండి మరియు ఫిట్‌గా ఉండండి.