1. వార్తలు
  2. »
  3. తెలుగు వార్తలు
  4. »
  5. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 28 మే 2014 (13:20 IST)

నరేంద్ర మోడీతో షరీఫ్ చర్చలు సఫలం : సుష్మా స్వరాజ్

పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చర్చలు సఫలం అయ్యాయని భారత విదేశాంగ వ్యవహారాల శాఖమంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. ఆమె బుధవారం విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సుష్మ మాట్లాడుతూ ఉగ్రవాద చర్యలు ఆగితేనే పాకిస్థాన్‌తో సత్సంబంధాలు ఉంటాయన్నారు.
 
పొరుగు దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకుంటామన్నారు. ప్రపంచంలో సార్క్ దేశాలను బలమైన కూటమిగా నిలబెట్టాలని సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు. ప్రధాని  నరేంద్ర మోడీని అమెరికా రావాలని ఒబామా ఆహ్వానించారని సుష్మ తెలిపారు.  అంతేకాకుండా, భారత్‌ను ప్రపంచ పర్యాట కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు.