ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే
telugu, telangana chambers
రెండు తెలుగు రాష్ట్రాలలో ఎగ్జిబిటర్లు థియేటర్లను మూసివేయాలనితీసుకున్న నిర్ణయం తమకు సంంధంలేదని తెలుగు పిలింఛాంబర్ ప్రకటనలో పేర్కొంది. ఇది వారి వ్యక్తి గతం. అయితే ఆంధ్రతోపాటు తెలంగాణాలోనూ డిజిటల్ అవ్వడం వల్ల థియేటర్ల యజమానులు అందుకు టాక్స్ కూడా కట్టలేకపోవడం ఆదాయం లేకపోవడంతో ఇబ్బందులుపడుతున్నారని లేఖ లో పేర్కొన్నారు. ఇదిలా వుండగా, తెలంగాణ ఛాంబర్ మాత్రం తమను సంప్రదించకుండానే చాంబర్ ఎలా స్టేట్ మెంట్ ఇస్తుందని మండిపడింది.
ఛాంబర్ కార్యదర్శి ప్రసన్న కుమార్ లేఖ సారాంశం ఇలా ఉంది.
ఇందు మూలంగా తెలియజేయునది ఏమనగా, గుంటూరు ఏరియాతో పాటు ఆంధ్రా ప్రాంతంలోని మరికొన్ని ప్రాంతాల్లోని సినిమా థియేటర్ల యజమానులు గత కొన్ని నెలలుగా తగిన ఆదాయం పొందలేకపోతున్నారని, తద్వారా డిజిటల్ ప్రొవైడర్లకు (UFO, Qube) ఛార్జీలు. చెల్లించలేకపోతున్నారని కారణాన్ని చూపుతూ తమ సినిమా థియేటర్లను మూసివేసినట్లు మా దృష్టికి వచ్చింది. అదే విధంగా తెలంగాణలో కూడా కొన్ని సినిమా థియేటర్ల యజమానులు తమ ఇష్టానుసారం తమ థియేటర్లను ప్రేక్షకులు లేని కారణంగా ప్రదర్శన రద్దు చేయడమైనది అని పెట్టేవారు. ఇది ప్రధానంగా ఎన్నికలు మరియు IPL కారణంగా తక్కువ ఫుట్ఫాల్ల కారణంగా జరిగింది, తద్వారా ఆదాయాలపై ప్రభావం పడింది.
ఈ సందర్భంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని అపెక్స్ బాడీస్ అంటే తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలికి సంబంధం లేకుండా, ఒక సంఘం సినిమా థియేటర్లను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నాము అని తెలియజేస్తున్నాము.
సోషల్ మీడియా, డిజిటల్ మీడియా మరియు ప్రింట్ మీడియాలో సినిమా థియేటర్ల మూసివేతకు సంబంధించి తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా నుండి ఏ గ్రూప్ గాని సినిమా థియేటర్ యజమానులు లేదా మరే ఇతర అసోసియేషన్ నుండి గాని అపెక్స్ బాడీలకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదని మేము పునరుద్ఘాటిస్తున్నాము. అందుకే థియేటర్ల బంద్ ఫేక్ అని తెలియజేస్తున్నాం. ఇది తక్కువ వసూళ్లు రావడంతో థియేటర్లను మూసివేసిన కొందరు థియేటర్ యజమానులు వారి వ్యక్తిగత నిర్ణయం. దీనికి సంబంధించి, పైన పేర్కొన్న అన్ని అపెక్స్ బాడీస్ అంటే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి సినిమా థియేటర్ల మూసివేతకు సంబంధించి ఎటువంటి సంబంధం లేదని మరోసారి స్పష్టం చేయబడింది. మా సంస్థలు తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తాయి అని తెలిపారు.
థియేటర్ల బంద్ ఎగ్జిబిటర్స్ వ్యక్తిగత నిర్ణయం.. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు ఎలాంటి సంబధం లేదు
తెలంగాణ రాష్ట్రంలో రెండు వారాల పాటు సినిమా థియేటర్స్‌లో ప్రదర్శనలు నిలిపివేస్తున్నట్టు థియేటర్స్ యాజమాన్యం ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ ప్రకటనపై తాజాగా తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పందించింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసివేయాలన్నది ఎగ్జిబిటర్ల వ్యక్తిగత నిర్ణయం. ఈ నిర్ణయం తీసుకునే ముందు ఎగ్జిబిటర్స్ తమను సంప్రదించలేదు అని ఫిలిం చాంబర్ ఒక నోట్ విడుదల చేసింది. ఈ నిర్ణయం ఎగ్జిబిటర్స్ వ్యక్తిగతంగా తీసుకున్నారని దీనిపై తెలంగాణ ఫిలిం ఛాంబర్‌కు ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు సునీల్ నారంగ్, సెక్రటరీ కె అనుపమ్ రెడ్డి ప్రకనట విడుదల చేశారు.