ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 ఫిబ్రవరి 2023 (21:07 IST)

భార్య విగ్రహాన్ని ప్రతిష్టించిన భర్త.. రోజూ పూజలు..

Wife status
Wife status
ప్రేమ కోసం తాజ్‌మహల్ కట్టిన చరిత్ర మనదేశానికి వుంది. తాజాగా తమిళనాడు రైతు భార్య కోసం విగ్రహాన్ని ప్రతిష్టించింది. ఆమె జ్ఞాపకార్థం రోజూ పూజలు చేస్తున్నాడు. 
 
వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూరులో 75 ఏళ్ల రైతు పళనిస్వామి తన భార్యను స్మరించుకునేందుకు ఆలయంలో ఆమె విగ్రహాన్ని ప్రతిష్టించి రోజూ పూజలు చేస్తున్నారు. రైతు భార్య చనిపోయిందని, ఆమెను విడిచిపెట్టడం తనకు ఇష్టం లేదని, అందుకే తాను ఎక్కడికీ వెళ్లనని పళనిస్వామి తెలిపాడు.
 
పళనిస్వామి తన భార్యను గుర్తు చేసుకుంటూ, తమ వైవాహిక జీవితం 45 సంవత్సరాలు సుఖమయంగా సాగిందని, ఆమె ఆకస్మిక మరణం తనను షాక్‌కు గురిచేసిందని అన్నాడు.