గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 ఫిబ్రవరి 2023 (11:16 IST)

నడుస్తుండగా కాలు స్లిప్ అయిన వైనం.. కిందపడిన గవర్నర్ తమిళిసై

Tamilisai Soundararajan fall
తమిళనాడు రాష్ట్ర పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్ అదుపుతప్పి కాలుజారి కిందపడ్డారు. ఆమె నడుస్తుండగా కాలు స్లిప్ అయింది. దీంతో ఆమె కిందడ్డారు. అయితే, ఆమెకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అధికారులంతా ఊపిరి పీల్చుకున్నారు. 
 
చెన్నై నగర శివారు ప్రాంతమైన మహాబలిపురం వద్ద ఆదివారం హైబ్రిడ్ రాకెట్ ప్రయోగ కార్యక్రమం జరిగింది. విద్యార్థులు ఈ ఉపగ్రహాలను తయారు చేశారు. 150 పైకో శాటిలైట్లను ఒక రాకెట్ ద్వారా నింగిలోకి పంపించారు. ఈ తరహా రాకెట్ ప్రయోగం చేపట్టడం ఇదే తొలిసారి. ఈ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. 
 
కార్యక్రమం ముగిసిన తర్వాత ఆమె ప్రసంగించేందుకు వేదిక వద్దకు వెళుతుండగా కాలు స్లిప్ అయి తూలి కిందపడ్డారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆమెను పైకి లేపి నిల్చోబెట్టారు. ఈ ఘటనలో ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై ఆమె స్పందిస్తూ, తనకు ఎలాంటి గాయాలు తగలలేదని తాను కిందపడిపోయినందుకు టీవీల్లో మాత్రం ఈ వార్త హైలెట్ అవుతుందని చమత్కరించారు.