ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 25 ఆగస్టు 2024 (20:04 IST)

ఫుల్లుగా మద్యం సేవించి కుర్చీలో హాయిగా నిద్రపోయిన ఉపాధ్యాయుడు (Video)

teacher sleeping
అస్సాంలో ఓ కలియుగ ఉపాధ్యాయుడు వెలుగులోకి వచ్చారు. ఈ రాష్ట్రంలోని కామాఖ్య నగర్‌లో ఒక ఉపాధ్యాయుడు పీకల వరకు మద్యం సేవించి పాఠశాలకు వచ్చి... కుర్చీలో గుర్రుపెట్టి నిద్రపోయాడు. ఆ ఉపాధ్యాయుడు కుర్చీ చుట్టూ విద్యార్థులు నిలబడి గోలగోల చేస్తూ, నిద్రలేపే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోను చూసిన ఉపాధ్యాయుడి తీరుపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పూటుగా తాగి బడికి వచ్చిన ఉపాధ్యాయుడికి ఆ తర్వాత మత్తు మరింత ఎక్కువైంది. కుర్చీలో కూలబడి అలాగే నిద్రపోయాడు. విద్యార్థులు, సహచర ఉపాధ్యాయులు అతడిని లేపేందుకు ప్రయత్నించినా చీమకుట్టినట్టు కూడా అతడికి అనిపించలేదు. ఈ ఘటన అస్సాంలోని కామాఖ్యనగరులో జరిగినట్టుగా తెలుస్తోంది. నిద్రపోతున్న ఉపాధ్యాయుడి చుట్టూ చేరిన విద్యార్థులు గోల చేస్తూ ఆయనను నిద్రలేపేందుకు ప్రయత్నించినా ఆయనలో చలనం కనిపించలేదు. 
 
అంతేకాదు, నిద్రమత్తులో కుర్చీలోనే ఆయన మూత్ర విసర్జన చేసినట్టుగా విద్యార్థులు చెబుతున్నారు. వీడియో వైరల్ కావడంతో సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యావిధానం ఇప్పటికే దారుణంగా ఉందని, ఇలాంటి బాధ్యతారహిత ఘటనలు దానిని మరింత దిగజారుస్తున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.