శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 డిశెంబరు 2022 (08:13 IST)

ఐదేళ్ల ప్రేమ.. ట్రాన్స్‌జెండర్‌ను పెళ్లాడిన జగిత్యాల యువకుడు

marriage
ప్రేమ కోసం ఆ యువకుడు ఎక్కువే చేశాడు. ఐదేళ్ల పాటు ప్రేమించి ట్రాన్స్‌జెండర్‌ను పెళ్లాడాడు. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఓ యువకుడు ట్రాన్స్‌జెండర్‌ను వివాహం చేసుకున్నాడు. జిల్లాలోని వీణవంకకు చెందిన ట్రాన్స్‌జెండర్ సంపత్ ఇంట్లోంచి వెళ్లిపోయి చాలాకాలం తర్వాత తిరిగి జగిత్యాల చేరుకున్నాడు. 
 
ఈ క్రమంలో కారు డ్రైవర్ అర్షద్‌తో పరిచయం ప్రేమ మొదలైంది. అందుకు సంపత్ నిరాకరించాడు. ఐదేళ్ల పాటు  అర్షద్ ప్రేమ తగ్గలేదు. దీంతో చలించిపోయిన సంపత్ లింగమార్పిడి శస్త్రచికిత్స చేయంచుకుని దివ్యగా పేరు మార్చుకున్నాడు. వీరు శుక్రవారం వివాహం చేసుకున్నారు ప్రస్తుతం వీరి వివాహం టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యింది.