శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 2 జనవరి 2020 (15:18 IST)

ఆధార్-పాన్ లింకింగ్ గడువు మళ్లీ పెంపు (Video)

ఆధార్, పాన్ (పర్మనెంట్ అకౌంట్ నెంబర్) కార్డులను లింక్ చేసేందుకు గడువును సీబీడీటీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్డైరెక్ట్ ట్యాక్సెస్) మార్చి 31, 2020కి పొడిగించింది. ఇంతకుముందు ఉన్న గడువు డిసెంబర్ 31తో తీరిపోనుండటంతో సోమవారం ఈ మేరకు డెడ్ లైన్ ను సీబీడీటీ పెంచింది.
 
‘‘ఇన్ కంట్యాక్స్ యాక్ట్, 1961లోని సెక్షన్ 139ఏఏ, సబ్ సెక్షన్ 2 ప్రకారం, పాన్, ఆధార్లను లింక్ చేయడాన్ని తప్పనిసరి చేసేందుకు తుది గడువు డిసెంబర్ 31, 2019గా ఉండగా, దానిని మార్చి 31, 2020 వరకూ పొడిగించాం” అని సీబీడీటీ అఫీషియల్ ట్విటర్ హ్యాండిల్ లో పేర్కొంది.

పాన్– ఆధార్ లింకింగ్ కు తుది గడువును సీబీడీటీ పొడిగించడం ఇది 8వ సారి. ఆధార్ స్కీంకు రాజ్యాంగబద్ధత ఉందని సుప్రీంకోర్టు గత ఏడాది సెప్టెంబర్ లో తీర్పు చెప్పింది. ఆధార్ ను పాన్ కార్డుతో లింక్ చేసేందుకు ఆమోదం తెలిపింది.