మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 సెప్టెంబరు 2021 (16:21 IST)

బెంగళూరులో భారీ పేలుడు... 100 మీటర్లు దూరంలో మూడు మృతదేహాలు

బెంగళూరు చామరాజపేటలోని ఓ భవనంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. భవనంలో బాణసంచా ఒక్కసారిగా పేలడంతో 100 మీటర్లు దూరంలో మూడు మృతదేహాలు ఎగిరిపడ్డాయి. పేలుడు ధాటికి మృతదేహాలు తునాతునకలైయ్యాయి. 
 
ఈ ఘటనలో గాయపడిన మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వి.వి.పురం పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. 
 
భవనం పక్కనే ఉన్న పంక్చర్‌ షాపు కూడా ధ్వంసమైంది. వి.వి.పురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు అందిస్తున్నారు. గ్యాస్ పేలుడా లేక.. బాణా సంచా పేలుడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.