శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 8 జనవరి 2018 (12:05 IST)

ఎనిమిది మందిని పెళ్లాడిన నిత్యపెళ్లికొడుకు.. రూ.4.5కోట్లు గుంజేశాడు

ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా ఎనిమిది మందిని వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో రూ.4.5కోట్లు గుంజుకున్నాడు. ఈ నిత్యపెళ్లి కొడుకు వ్యవహారం తమిళనాడులోని కోయంబత్తూరులో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే

ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా ఎనిమిది మందిని వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో రూ.4.5కోట్లు గుంజుకున్నాడు. ఈ నిత్యపెళ్లి కొడుకు వ్యవహారం తమిళనాడులోని కోయంబత్తూరులో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూర్‌లో పెళ్లి సంబంధాల ఏజెన్సీ నిర్వహించే మోహన్‌.. విడాకులు తీసుకున్నవారు.. వితంతువులను లక్ష్యంగా పెట్టుకుని ఎనిమిదేళ్లలో ఏకంగా ఎనిమిది మందిని పెళ్లాడాడు. 
 
కానీ చెన్నైలోని ఇందిరా గాంధీ (45) అనే లెక్చరర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మాయమాటలు చెప్పి.. ఇందిరను పెళ్లాడిన మోహన్.. చెన్నైలోని ఆమె ఇంటిని రూ.1.5 కోట్లకు అమ్మేలా చేశాడు. 
 
ఆ డబ్బుతో కోవైలో ఇల్లు కొంటానని నమ్మబలికి డబ్బు గుంజేశాడు. ఆపై అతని ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసు విచారణలో మోహన్ ఎనిమిది మందిని వివాహం చేసుకున్నట్లు తేలింది. వారిని కూడా ఇందిరలా మోసం చేసి కోట్లు మోసం చేశాడని పోలీసులు వెల్లడించారు.