శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 8 జనవరి 2018 (11:28 IST)

అక్క మొగుడితో అక్రమ సంబంధం.. అడ్డుగా ఉన్నాడనీ భర్తను చంపేసిన భార్య

మొన్న స్వాతి.. నిన్న జ్యోతి.. నేడు శ్రీవిద్య.. అక్రమ సంబంధాలు పెట్టుకొని కట్టుకున్న భర్తనే హత్య చేసిన కిలాడీ లేడీల జాబితా ఇది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో భర్తను హతమార్చిన జాబితాలో మర

మొన్న స్వాతి.. నిన్న జ్యోతి.. నేడు శ్రీవిద్య.. అక్రమ సంబంధాలు పెట్టుకొని కట్టుకున్న భర్తనే హత్య చేసిన కిలాడీ లేడీల జాబితా ఇది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో భర్తను హతమార్చిన జాబితాలో మరో మహిళ చేరింది. గుంటూరు జిల్లాకు చెందిన శ్రీవిద్య (24) తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్క మొగుడితో గుట్టుగా సాగిస్తూ వచ్చిన తన అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనీ భావించి ఈ దారుణానికి పాల్పడింది. భర్తకు మద్యంలో విషం కలిపి హత్య చేసింది. ఈ హత్య తర్వాత పరారీలో ఉన్న ఆ మహిళ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గుంటూరు పానుగుబాడుకు చెందిన నరేంద్ర చౌదరి అనే వ్యక్తి ఇదే జిల్లాలోని పేరేచర్లలో ఉన్న ఆంధ్రా షుగర్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఈయనకు కొన్నేళ్ళ క్రితం మేనమామ కుమార్తె శ్రీవిద్యతో వివాహమైంది. శ్రీవిద్య కూడా నర్సారావుపేటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పని చేస్తోంది. 
 
అయితే, శ్రీవిద్యకు ప్రకాశం జిల్లా కురిచేడు ఆవులమంద గ్రామానికి తన అక్క భర్త గొట్టిపాటి వీరయ్య చౌదరితో పెళ్లికి ముందు నుంచే అక్రమ సంబంధం ఉంది. ఈ వివాహేతర సంబంధం శ్రీవిద్యకు పెళ్లయిన తర్వాత కూడా కొనసాగిస్తూ వచ్చింది. తమ సుఖానికి భర్త అడ్డొస్తున్నాడనీ భావించిన శ్రీవిద్య భర్త అడ్డు తొలగించుకోవాలని బావ వీరయ్యతో కలిసి ప్లాన్ వేసింది. 
 
ఇందులోభాగంగా, భర్త నరేంద్రకు మద్యంలో విషం కలిపి ఇచ్చింది. ఆ తర్వాత మృతదేహాన్ని వీరయ్య తన ఇద్దరు స్నేహితులు గుంజి బాలరాజు, పూజల చౌడయ్యల సహాయంతో కారులో తీసుకెళ్ళి నిర్మానుష్య ప్రాంతంలో పడేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో భాగంగా, మృతదేహం ఉన్న ప్రాంతంలో ఒక్క చెప్పు లభ్యమైంది. 
 
మరో చెప్పు కోసం గాలించిన పోలీసులకు.. ఆ చెప్పు వీరయ్య కారులో లభ్యమైంది. దీంతో కేసులోని మిస్టరీ వీడిపోయింది. బావ వీరయ్యతో ఉన్న అక్రమ సంబంధాన్ని స్వేచ్ఛగా కొనసాగించేందుకు భార్య శ్రీవిద్య భర్తను హత్య చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో భార్య శ్రీవిద్యతో పాటు... వీరయ్య చౌదరి, వీరికి సహకరించిన గుంజి బాలరాజు, పూజల చౌడయ్యలను కూడా అరెస్టు చేశారు.