శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By selvi
Last Updated : శనివారం, 6 జనవరి 2018 (10:47 IST)

కడుపు చేసి పెళ్లికి నో చెప్పాడు... ప్రియుడిని చితక్కొట్టిన మహిళ

తెలంగాణ రాష్ట్రంలో ఓ మహిళ ప్రేమికుడి చేతిలో మోసపోయింది. గర్భవతిని చేసి మోసం చేయడంతో ఆగ్రహించిన ఆ యువతి తన ప్రియుడిని పట్టుకుని చితక్కొట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఈ ఘట జరిగింది. ఈ వి

తెలంగాణ రాష్ట్రంలో ఓ మహిళ ప్రేమికుడి చేతిలో మోసపోయింది. గర్భవతిని చేసి మోసం చేయడంతో ఆగ్రహించిన ఆ యువతి తన ప్రియుడిని పట్టుకుని చితక్కొట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఈ ఘట జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మండలంలోని దంతెలబోరకు చెందిన కౌవులోరి సమ్మక్కకు నాలుగేళ్ల క్రితం పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండలం మిట్టగూడెం గ్రామానికి చెందిన నాగరాజుతో వివాహం జరిగింది. కొన్నాళ్లకు ఇద్దరూ విడిపోయారు. తర్వాత సమ్మక్కకు మిట్టగూడేనికి చెందిన గాడిద శ్రీనివాస్‌ అనే వ్యక్తి భద్రాచలం డిపోలో ఆర్టీసీ బస్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. శ్రీనివాస్‌తో సమ్మక్కకు పరిచయం ఏర్పడి ప్రేమించుకున్నారు. 
 
సమ్మక్కను శ్రీనివాస్‌ పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆమె తల్లిదండ్రులతోనూ మాట్లాడాడు. ఆ తర్వాత ఇద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. ప్రస్తుతం సమ్మక్క ఆరు నెలల గర్భవతి. దీంతో శ్రీనివాస్ ఆమెకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని గమనించిన సమ్మక్క కుటుంబ సభ్యులు పాల్వంచ రూరల్‌ స్టేషన్‌లో గత నెల 18న ఫిర్యాదు చేశారు. 
 
శ్రీనివాస్‌ను పోలీసులు పిలిపించి మందలించడంతో పెళ్లికి అంగీకరించాడు. స్టేషన్ నుంచి బయటకురాగానే శ్రీనివాస్‌ పారిపోయాడు. ఈ క్రమంలో పాల్వంచలో మరో యువతితో శ్రీనివాస్ తిరుగుతుండగా సమ్మక్క, వారి తల్లిదండ్రులు చూశారు. దీంతో శ్రీనివాస్‌ను పట్టుకొని చితకబాది పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లి అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.