శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 7 మే 2017 (10:37 IST)

భర్తకు భార్య చెప్పిన తలాక్ చెల్లదన్న ముస్లిం మతపెద్ద...

తన భర్తపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించిన ఓ మహిళకు ముస్లిం మతపెద్దలు అడ్డుతగిలారు. తమ మత సంప్రదాయం ప్రకారం భర్తకు తలాక్ చేప్పే అలవాటు లేదని, అందువల్ల భర్త నుంచి విడాకులు తీసుకునేందుకు ఆ మహిళ చెప్పిన

తన భర్తపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించిన ఓ మహిళకు ముస్లిం మతపెద్దలు అడ్డుతగిలారు. తమ మత సంప్రదాయం ప్రకారం భర్తకు తలాక్ చేప్పే అలవాటు లేదని, అందువల్ల భర్త నుంచి విడాకులు తీసుకునేందుకు ఆ మహిళ చెప్పిన తలాక్ చెల్లదని మీరట్ ప్రధాన కాజీ జెనూర్‌ రషిదీన్‌ స్పష్టంచేశారు. 
 
'ముస్లిం పురుషులు ట్రిపుల్‌ తలాక్‌ చెప్పి భార్యలకు విడాకులిచ్చినట్టే.. నా భర్తకు పెద్దలందరి ముందూ తలాక్‌ చెప్పాలని ఉంది' అంటూ మూడు రోజుల క్రితం పోలీసులను ఆశ్రయించిన మీరట్‌ మహిళ అమ్రీన్‌ బానో(24) గురించి తెలిసేవుంటుంది. ట్రిపుల్‌ తలాక్‌ను రద్దు చేయాలని చాలా మంది ముస్లిం మహిళలు డిమాండ్‌ చేస్తుంటే.. అమ్రీనా మాత్రం తన భర్తపై అదే ఆయుధాన్ని ప్రయోగించి దేశవ్యాప్తంగా సంచలనమైంది. 
 
అమ్రీన్‌, ఆమె చెల్లెలు ఫర్హీన్‌.. 2012లో సబీర్‌, షకీర్‌ అనే అన్నదమ్ముల్ని పెళ్లి చేసుకున్నారు. అప్పటినుంచి అన్నదమ్ములిద్దరూ తమను వేధిస్తూ చిత్రహింసలకు గురిచేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత యేడాది సెప్టెంబరులో చిన్న గొడవకే షకీర్‌ తన భార్య ఫర్హీన్‌కు తలాక్‌ చెప్పేశాడు. ఆ తర్వాత అక్కా చెల్లెళ్ళలను అన్నాదమ్ములు ఇంటినుంచి బయటకు గెంటేశారు. దీంతో వారిద్దరూ తమ భర్తలపై జనవరి 30న పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఇన్నాళ్లయినా పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో ఉన్నతాధికారులను ఆశ్రయించారు. అప్పుడే.. ‘నా భర్తకు తలాక్‌ చెప్పాలని ఉంది’ అంటూ అమ్రీన్‌ మీడియా ముందు ఆగ్రహంగా వ్యాఖ్యానించింది. ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ కార్యాలయంలో.. మీడియా సమక్షంలో భర్తకు ముమ్మారు తలాక్‌ చెప్పింది. ‘‘మమ్మల్ని కట్నం కోసం హింసించారు. అదేమని అడిగినందుకు నా చెల్లెలికి ఆమె భర్త విడాకులిచ్చారు. ఇప్పుడు నా భర్తకు తలాక్‌ చెప్పి నేను పగతీర్చుకున్నాను’’ అని ఆమె మీడియాకు చెప్పింది. అయితే, భర్తలకు ట్రిపుల్ తలాక్ చెప్పే సంప్రదాయం తమ మత ఆచారంలో లేవని మీరట్ కాజీ ప్రకటించి.. ఆ మహిళకు షాకిచ్చారు.