బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (14:49 IST)

ఒడిశాలో రెండు ఎలుగు బంట్లు ఫుట్‌బాల్ ఆడాయి.. వీడియో

ఒడిశాలో రెండు ఎలుగు బంట్లు ఫుట్‌బాల్ ఆడాయి. నబరంగ్‌పూర్ జిల్లాలోని సుకీగావ్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామీణ యువకులు ఫుట్‌బాల్ ఆడుతున్న సమయంలో అక్కడకు రెండు ఎలుగు బంట్లు వచ్చాయి. అయితే ఆ వన్యప్రాణుల్ని చూసిన యువకులు అక్కడ నుంచి పరుగుతీశారు. 
 
మైదానంలోనే ఫుట్‌బాల్‌ను వదిలేసి వాళ్లు వెళ్లిపోయారు. అయితే ఆ బంతిని తీసుకున్న ఎలుగు బంట్లు కాసేపు దానితో ఆట ఆడేశాయి. కిందకు పైకి విసిరివేస్తూ.. ఫుట్‌బాల్ స్కిల్స్ ప్రదర్శించాయి. మనుషుల్లాగే అవీ తమ ట్యాలెంట్‌ను చూపించాయి. 
 
స్మార్ట్ యానిమల్స్ రీతిలో ఆ ఎలుగు బంట్లు హంగామా చేశాయి. అవి ఫుట్‌బాల్ ఆడుతున్న దృశ్యాలను గ్రామ యువకులు భయం భయంగానే తమ సెల్‌ఫోన్లలో బంధించారు. కొందరు వీడియోలు, కొందరు ఫోటోలు తీశారు. ఎప్పుడూ ఊరి బయట కనిపించే ఎలుగు బంట్లు ఈసారి పిల్లలు ఆడే ఫుట్‌బాల్‌ను తీసుకుని అడవికిలోకి వెళ్లినట్లు ఓ స్థానికుడు తెలిపారు.