సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 31 మార్చి 2021 (19:56 IST)

మహారాష్ట్ర సీఎం సతీమణికి కరోనావైరస్, ఆరోగ్యం క్షీణించిందా?

మహారాష్ట్రను కరోనావైరస్ వణికిస్తోంది. దేశంలో సింహభాగం కేసులు అక్కడే నమోదవుతున్నాయి. కాగా ఈ మహమ్మారి బారిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే సతీమణి కూడా పడ్డారు. ఆమెకు మార్చి 23వ తేదీ కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. గత వారం రోజులుగా ఆమె క్వారంటైన్లో వుంటున్నారు.
 
ఐతే మంగళవారం అర్థరాత్రి ఆమెను హఠాత్తుగా ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె మార్చి 11వ తేదీన తన భర్తతో కలిసి కోవిడ్ టీకా తీసుకున్నారు. టీకా తీసుకున్నప్పటికీ ఆమె కరోనా బారిన పడ్డారు. కాగా ఆమె ఆరోగ్యం క్షీణించిందంటూ పుకార్లు వినిపిస్తున్నాయి.