బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 27 మార్చి 2021 (14:35 IST)

నిద్రపోతున్న భార్య.. చేతివేళ్లు తెగనరికిన భర్త.. ఎక్కడ?

ఇటీవలి కాలంలో కొందరు భర్తలు తమ భార్యల పట్ల అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. చిన్నచిన్న విషయాలకే క్షణికావేశానికిగురై నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇంట్లో నిద్రపోతున్న భార్య బొటనవేలుతో పాటు.. మూడు వేళ్ళను కసాయి భర్త నరికేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బేతుల్ జిల్లాలో వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, బేతుల్ జిల్లా చిచోలి గ్రామానికి చెందిన రాజు తరచూ భార్యతో గొడప పడుతుంటాడు. వాగ్వాదంతో భార్యపై కోపంతో ఉన్న రాజు శనివారం తెల్లవారుజామున భార్య నిద్రపోతుండగా ఆమె చేతి బొటనవేలు, మూడు వేళ్లను గొడ్డలితో నరికాడు. 
 
దీంతో ఒక్కసారిగా కేకలు పెడుతూ నిద్రలేచింది. భర్త చేసిన ఘాతుకానికి కుమిలికుమిలి ఏడ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఇరుగుపొరుగువారు ఆమెను హుటాహుటిన హమీదియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి భర్తను అరెస్టు చేశారు. 
 
కాగా, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గత 15రోజుల్లో ఇలాంటి దారుణం జరగడం ఇది మూడోసారి కావడం గమనార్హం. ఈఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాగర్ జిల్లాలో మార్చి 22వ తేదీ 2న ఓ భర్త తన భార్య చేతులు నరికి ఆమెను అడవిలో వదిలివేసిన విషయం తెల్సిందే.