1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 17 జులై 2017 (19:47 IST)

ఉషాపతిని ఉపరాష్ట్రపతి నాకెందుకయా... అన్నప్పటికీ ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్య...

కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుని ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో నిర్ణయించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడిని ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అభినందించారు. ఆయన ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక కావడం పట్ల వెంకయ్యక

కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుని ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో నిర్ణయించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడిని ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అభినందించారు. ఆయన ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక కావడం పట్ల వెంకయ్యకు అభినందనల వెల్లువెత్తుతోంది. రేపు నామినేషన్ దాఖలు చేయనున్న వెంకయ్య నాయుడు.
 
ఇక వెంకయ్య నాయుడు గురించి చూస్తే... ఆయన 1949లో జన్మించారు. వెంకయ్య స్వస్థలం నెల్లూరు జిల్లా చవటపాలెం. వీఆర్ కాలేజీలో డిగ్రీ చదివారు. 77-80 మధ్యలో జనతా పార్టీ యువ విభాగానికి అధ్యక్షుడిగా పనిచేశారు. 1978, 83లో రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వాజ్ పేయి కేబినెట్లో గ్రామీణాభివృద్ధి మంత్రిగా పనిచేశారు. 1998లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వెంకయ్య మోదీ కేబినెట్లో మంత్రివర్యులుగా పనిచేస్తున్నారు.