గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 10 జులై 2021 (14:12 IST)

గ్రామ అమ్మాయిని ప్రేమించాడనీ యువకుడి మర్మాంగంపై దాడి

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ యువకుడు తమ గ్రామం అమ్మాయిని ప్రేమించాడని ఆ యువకుడి మర్మాంగంపై గ్రామ పెద్దలు అతి కిరాతకంగా దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం కాన్పూర్ దేహాట్ జిల్లాలోని అక్బర్పూర్ ప్రాంతానికి చెందిన అమ్మయిని ఓ యువకుడు ప్రేమించాడు. ఈ యువతిని చూసేందుకు ప్రియుడు వచ్చాడు. వారి ప్రేమ వ్యవహారం గురించి తెలిసిన యువతి బంధువులు కొందరు ఆ యువకుడి దగ్గరకు వెళ్లారు. 
 
అతని కులం అడగగా అతను చెప్పడానికి నిరాకరించారు. దీంతో అతన్ని వారు తన్ని, కర్రలతో తీవ్రంగా కొట్టారు. అనంతరం అతన్ని చెట్టుకు కట్టేసి విచక్షణ లేకుండా కొట్టారు. యువకుడి మర్మాంగాలపై దాడి చేశారు. ఇదింతా ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వీడియో వైరల్ అయింది. 
 
ఈ వీడియోను చూసిన పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. ఇతర నిందితులను పట్టుకునేందుకు పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. గ్రామస్తుల దాడిలో తీవ్రంగా గాయపడిన యువకుడు చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.