బుధవారం, 5 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 29 ఏప్రియల్ 2017 (21:32 IST)

కోరికల 'తృప్తి' కోసమే భార్యలకు అలా చెప్పేస్తున్నారు... యోగీ ఆదిత్యనాథ్ మంత్రి మాట...

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ మంత్రిమండలిలోని కేబినెట్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్య దుమారం సృష్టిస్తోంది. తలాక్ గురించి చర్చ జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి. తలాక్ పైన మంత్రి స్వామి ప్రసాద్ మాట్లాడుత

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ మంత్రిమండలిలోని కేబినెట్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్య దుమారం సృష్టిస్తోంది. తలాక్ గురించి చర్చ జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి. తలాక్ పైన మంత్రి స్వామి ప్రసాద్ మాట్లాడుతూ... తలాక్ అనే ప‌ద్ధ‌తిని ఉపయోగించుకొని భార్యలను మారుస్తూ తమ ‘కోరికలని’ సంతృప్తి పరుచుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
 
భర్తల తలాక్ దెబ్బకు అన్యాయమవుతున్న ముస్లిం మహిళలకు తమ పార్టీ అండగా వుంటుందని అన్నారు. తలాక్ అనే పద్ధతి నిరంకుశమైనదని అన్నారు. తన కోర్కెలను తీర్చుకునేందుకు ఓ వ్యక్తి తలాక్ అనే పద్ధతి ద్వారా కట్టుకున్న భార్యను, వారి సంతానాన్ని రోడ్డున పడేస్తున్నారని అన్నారు.