శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 26 జూన్ 2017 (14:05 IST)

టెర్రస్‌పై నుంచి 85 యేళ్ళ అత్తను కిందికి తోసేసిన కోడలు

ఇంటిని తన పేరుపై రాయడానికి నిరాకరించిన అత్తకు ఓ కోడలు ప్రత్యక్ష నరకం చూపించింది. అంతేకాకుండా, ఆమెను ఏకంగా టెర్రస్‌పై నుంచి కిందికి తోసేసింది. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఎటావాలో చోటుచేసుకుంది.

ఇంటిని తన పేరుపై రాయడానికి నిరాకరించిన అత్తకు ఓ కోడలు ప్రత్యక్ష నరకం చూపించింది. అంతేకాకుండా, ఆమెను ఏకంగా టెర్రస్‌పై నుంచి కిందికి తోసేసింది. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఎటావాలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఎటావాలో 85 యేళ్ళ వృద్ధురాలు తన కొడుకు, కోడలితో కలిసి నివశిస్తోంది. వీరు నివాసం ఉండే ఇల్లు ఆ వృద్ధురాలిపై ఉంది. ఆ ఇంటిని తన పేరు మీద రాయాలంటూ ఆమె కోడలు వేధించసాగింది. ఇందుకు ఆమె నిరాకరించింది. 
 
దీంతో ఆగ్రహం చెందిన ఆ కోడలు... ఇంట్లోని టెర్రస్‌పై నుంచి కిందికి తోసేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని ఇంటి చుట్టుపక్కలవారు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. నిందితురాలైన కోడలుపై కేసు నమోదు చేశారు.