సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 22 నవంబరు 2023 (11:16 IST)

కాటేసిన పాముతో ఆస్పత్రికి యువకుడు

Snake
కాటేసిన నాగుపామును ఆస్పత్రికి తీసుకెళ్లి తనకు ఇంజెక్షన్ చేయాలంటూ ఓ యువకుడు హల్చల్ చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీర్జాపూర్‌లో జరిగింది. లాల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పతుల్ఖీ గ్రామానికి చెందిన సూరజ్ అనే యువకుడిని అతని ఇంటివద్ద సోమవారం సాయంత్రం పాముకాటు వేసింది. సూరజ్ భయపడకుండా తనను కాటువేసిన పామును సంచిలో బంధించాడు. చికిత్స కోసం వెంటనే సమీపంలోని మీర్జాపుర్ ప్రభుత్వ ఆస్పత్రికి బైకుపై వెళ్లాడు. 
 
ఎమర్జెన్సీ వార్డుకు చేరుకుని తాను పాముకాటుకు గురయ్యానని తక్షణం ఇంజెక్షన్ ఇవ్వాలని వైద్యులు కోరాడు. తన వెంట తెచ్చిన పామును సంచిలో నుంచి తీసి ఎమర్జెన్సీ వార్డు బెడ్‌‍పై ఉంచాడు. ఆ తర్వాత సంచిలో బంధించాడు. అనంతరం సూరజ్‌కు వైద్యులు యాంటీవీనమ్ ఇంజెక్షన్ ఇచ్చాడు. దీంతో ఆ యువకు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టంచింది.