గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 అక్టోబరు 2021 (21:14 IST)

యూపీలో రాత్రి కర్ఫ్యూ ఎత్తివేత.. యోగి ఆదేశాలు

ఉత్తరప్రదేశ్‌లో కరోనా ఇన్‌ఫెక్షన్‌ కేసులు తగ్గుతున్న దృష్ట్యా రాత్రి కర్ఫ్యూను పూర్తిగా ఎత్తివేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు కొవిడ్ ప్రోటోకాల్‌ను పాటించే షరతుకు లోబడి.. కంటైన్మెంట్ జోన్ వెలుపల రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వర్తించే రాత్రి పూట కర్ఫ్యూను ఎత్తివేయాలని నిర్ణయించారు. కరోనా కేసులు నమోదవుతుండటంతో నియంత్రణ కోసం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించారు.
 
రాష్ట్రంలో ఇన్ఫెక్షన్ వేగంగా తగ్గుతుంది. అయితే ఇంకా పూర్తిస్థాయిలో తొలగిపోలేదు. కరోనా ఇన్‌ఫెక్షన్‌ నివారణ, చికిత్స ఏర్పాట్లను ముమ్మరం చేశారు. కొవిడ్ నిబంధనల ప్రకారం అన్ని పండుగలను శాంతియుతంగా నిర్వహించాలని హోం శాఖ అదనపు చీఫ్‌ సెక్రటరీ అవనీష్ అవస్తి సంబంధిత అధికారులకు సూచించారు. రాష్ట్రంలో 40 కి పైగా జిల్లాలను ఇప్పటికే కొవిడ్ రహితంగా ప్రకటించారు. 
 
రాష్ట్రంలోని 75 జిల్లాల్లో ఒక్కటి కూడా తాజా కొవిడ్ కేసు నమోదు కాలేదు. ఇది వైరస్ తగ్గుముఖం పట్టిందన్న విషయాన్ని సూచిస్తుంది. రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ ఎత్తివేసిన తర్వాత కూడా ప్రజలు కరోనా మార్గదర్శకాలను పాటించాలని ప్రభుత్వం ప్రజలకు సూచించింది.