గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : మంగళవారం, 19 అక్టోబరు 2021 (22:36 IST)

సంక్షేమం పేరుతో జగన్ ప్రభుత్వం అప్పులు: కనకమేడల రవీంద్రకుమార్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతూ, అందినచోటల్లా అప్పులు తెస్తూ, సంక్షేమ కార్యక్రమాల కోసమే తాము అప్పులు తెస్తున్నామని, పచ్చిఅబద్ధాలు, అవాస్తవాలు ప్రచారం చేస్తోందని, ప్రభుత్వతీరుకి కొందరు అధికారులుకూడా వత్తాసుపలుకుతున్నారని, ప్రభుత్వం చేస్తున్న అప్పులవివరాలు, లెక్కలు కాగ్ కి  (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) కూడా చెప్పకుండా జగన్ సర్కారు వివరాలు దాస్తోందని టీడీపీ సీనియర్ నేత, రాజ్యసభ స భ్యులు కనకమేడల రవీంద్రకుమార్ స్పష్టంచేశారు. 

మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే యథాతథంగా మీకోసం...!
 
ప్రభుత్వంతెస్తున్న అప్పులు, చేస్తున్నఖర్చులకు ఎక్కడా లెక్కలు ఉండటంలేదు. ఏ అకౌంట్  నుంచి ఏ అకౌంట్ కు డబ్బులు వెళు తున్నాయో, ఎందుకు వెళుతున్నాయో కూడాచెప్పడం లేదు. అసవరమైతే ట్రెజరీలను కూడా మార్చేస్తున్నారు. ఇదంతా చూ స్తుంటే రాష్ట్రఆర్థికపరిస్థితిపై చాలా అనుమానాలుకలుగుతున్నా యి. ఆ అనుమానాలను నివృతిచేసి, ప్రజలకు ఒకభరోసా కల్పిం చాల్సిన బాధ్యత అధికారంలోఉన్నవారిపైనే ఉంది. కానీ ఆ పని ప్రభుత్వం చేయడంలేదు.. అలాచేయకపోగా  పరస్పర విరుద్ధమైన వాదనలతో ప్రజలను నమ్మించాలని చూస్తోంది.

తెలుగుదేశం పాలనలో చేసిన అప్పులుతీర్చడానికే తాము అప్పులుచేస్తున్నా మనిచెబుతున్న పాలకులు, మరోపక్కన సంక్షేమకార్యక్రమాల కోసమే అప్పులు తెస్తున్నామని నిస్సిగ్గుగా అబద్ధాలుచెబుతున్నా రు. ప్రభుత్వం చెబుతున్నదానిలో ఏదినిజం? నిజంగా తెలుగుదే శం ప్రభుత్వంచేసిన అప్పులు తీర్చడానికే, ఇప్పుడు అప్పులు చేస్తుంటే, అలాతీసుకొచ్చిన సొమ్ముని అప్పులు తీర్చడానికే వాడాలి. కానీ అలాచేయడం లేదు.

నిజంగా ప్రజలకు అవసరమైన సంక్షేమకార్యక్రమాలకే అప్పులు చేస్తుంటే, ఏ రూపాయి దేనికి ఖర్చుపెడుతున్నారో ఆ లెక్కలు ప్రజలముందుంచాలి. అదీ చేయ డంలేదు. ప్రభుత్వం ఎంత అప్పుతెచ్చింది..ఎంత సంక్షేమపథకాల కు వాడిందో లెక్కలుచెప్పకుండా, లేని సంక్షేమం పేరుతో తెలుగు దేశంపై నిందలేస్తున్నారు. ప్రజల్ని పక్కదారి పట్టిస్తూ, ఆర్థికవ్య వస్థను సర్వనాశనంచేస్తున్నారు. చివరకు జీతాలుకూడాచెల్లించ లేని అధోగతికి రాష్ట్రాన్నిచేర్చారు.

ఇదే విషయాన్ని గతంలో తాము అనేకసందర్భాల్లో చెప్పాము. ఇప్పుడు అది కళ్లముందు కనిపిస్తోంది. ఉద్యోగులు తమకుజీతాలు రావడంలేదని గగ్గోలు పెడుతున్నారు. నవరత్నాల అమలుపేరుతో ప్రభుత్వం అయిన కాడికి అప్పులుతెస్తూ, ఆసొమ్ముంతా పాలకుల జేబుల్లోకి వెళ్లేలా చేస్తోంది. చాలామంది అప్పులతెచ్చే విషయంలో చంద్రబాబునా యుడిని, జగన్మోహన్ రెడ్డిని పోల్చి మాట్లాడుతున్నారు.  

02-06-2014 నాటికి, రాష్ట్రవిభజనతో పాటు మనరాష్ట్రానికి వచ్చిన అప్పు రూ.లక్షా64వేల33కోట్లు మాత్రమే. టీడీపీ హాయాంలో  రాష్ట్రంపైఉన్న అప్పు లక్షా80వేల673కోట్లు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రెండున్నరేళ్లు పూర్తికాకముందు అయిన  అప్పు రూ.2లక్షల87వేల357కోట్లు. రెండున్నరేళ్లలోపే వైసీపీ ప్రభుత్వం రూ.2లక్షల87వేలకోట్లకుపైగా అప్పులుచేస్తే, ఇక టీడీపీ హాయాంలో చేసిన అప్పు, ఇప్పుడున్నపాలకులకుఎలా భారంగా మారిందో వారేచెప్పాలి.

అసలు టీడీపీప్రభుత్వానికి రాష్ట్రం విడిపో యేనాటికి అప్పచెప్పిన అప్పుఎంత....  ఆ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రానికి మిగిల్చిన అప్పుఎంత? టీడీపీప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పు కేవలం రూ.లక్షా80వేలకోట్లు మాత్రమే. మరి వైసీపీ ప్రభుత్వం రెండున్నరేళ్లుపూర్తికాకముందే రూ.2లక్షల87వేలకోట్ల అప్పులుచేసింది.

అంతమొత్తంలో తెచ్చిన అప్పులో ఈ ప్రభుత్వం అమలుచేస్తున్న అన్నిరకాల సంక్షేమానికి ఖర్చుపెట్టిన సొమ్ము కేవలం రూ.లక్షా05వేలకోట్లు మాత్రమే. మిగిలిన రూ.లక్షా82వేల కోట్ల357కోట్లు ఏమయ్యాయి? వాటిని ఏంచేశారంటే సమాధానం చెప్పరు. అప్పులు తెచ్చింది ఎంత..సంక్షేమానికి ఖర్చు పెట్టిందెం తో ఈప్రభుత్వం నిజంచెప్పాలి.

ఇప్పుడు తానుచెప్పిన లెక్కలన్నీ ప్రభుత్వ బడ్జెట్ పుస్తకంలోనివే. అవన్నీ తప్పనిచెబితే, అసలు వాస్తవం ఏమిటోప్రభుత్వంగానీ, ప్రభుత్వపెద్దలు గానీ బహిర్గతం చేయాలి. వైసీపీప్రభుత్వం అధికారంలోఉందికాబట్టి, బడ్జెట్ పుస్త కంలోని లెక్కలకు అధికారంలోఉన్నవారే సమాధానంచెప్పాలి. సంక్షేమం పేరుతో అప్పుల్లో తెచ్చినసొమ్ములో సగంకూడా ఖర్చు పెట్టలేదు.

పబ్లిక్  (అంటే ప్రజలపై పడే అప్పులు) అప్పులు రూ.లక్షా42వేల491కోట్లు.  బ్యాంకులుద్వారా, కార్పొరేషన్ల కింద తెచ్చిన అప్పులు రూ.లక్షా05వేల806కోట్లు. నాన్ గ్యారంటీ కింద తెచ్చిన అప్పులు రూ.14వేలకోట్లు. అలానే ఇతర అకౌంట్లలోఉన్న సొమ్ముని అప్పులపేరుతో డ్రాచేసినదాని తాలూకా సొమ్ము రూ.25వేలకోట్లు. మొత్తంకలిపితే రూ.2లక్షల87వేల357కోట్లు. 

సంక్షేమానికి ఖర్చుపెట్టిన రూ.లక్షా05వేలకోట్లు పోగా, మిగిలిన సొమ్ముకి లెక్కలులేవు. ఇవన్నీగాక కరోనా సమయంలో వచ్చిన ఆదాయం అదనంగాఉంది, దాన్నేంచేశారోకూడా చెప్పడంలేదు. కరోనా సమయంలో ఈ ప్రభుత్వానికి ఆదాయం తగ్గనేలేదు. కాగ్ గతంలో రూ.42వేలకోట్లకు ఏపీప్రభుత్వం లెక్కలే చెప్పడంలేదని నిలదీసింది. ఈ రోజుకి ఆ 42వేలకోట్లకు లెక్కలుచెప్పలేదు.

కార్పొ రేషన్ల గురించి అడిగినా ప్రభుత్వం ఏమీచెప్పడంలేదు. ఏపీ ఎస్ డీసీ (ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్) పేరుతో  తీసు కొచ్చిన అప్పులసంగతి కూడా బయటకుపొక్కనివ్వడంలేదు. అప్పులుతెచ్చి సంక్షేమపథకాలు అమలుచేస్తున్నామన్న ప్రభు త్వ, పాలకుల వాదనను తీవ్రంగా ఖండిస్తున్నాం. సంక్షేమం పేరు తో వైసీపీప్రభుత్వం అవినీతి చేస్తోందనే అందరూభావించాలి.

ఎందుకంటే తెచ్చినఅప్పులకు లెక్కలుచెప్పడంలేదు కదా? రాష్ట్రప్రభు త్వానికి, కేంద్రప్రభుత్వమిచ్చిన అప్పులుఏంచేశారో కూడా తెలి యాలి.  చంద్రబాబునాయుడి ప్రభుత్వంలో క్యాపిటల్ ఎక్స్ పెండేచర్, వెల్ఫేర్ (సంక్షేమం) ఎక్స్ పెండేచర్ ఎంతఖర్చుపెట్టారో కూడా చూద్దాం. 

2014-15లో టీడీపీప్రభుత్వంలో క్యాపిటల్ ఎక్స్ పెండేచర్ రూ.11,409కోట్లు, వెల్ఫేర్ ఎక్స్ పెండేచర్ రూ.58,697.42కోట్లు. 2015-16లో క్యాపిటల్ ఎక్స్ పెండేచర్ రూ.14,171కోట్లు, వెల్ఫేర్ ఎక్స్ పెండేచర్ రూ.64,158కోట్లు, 2016-17లో క్యాపిటల్ ఎక్స్ పెండేచర్ రూ.15,180కోట్లు, వెల్ఫేర్ఎక్స్ పెండేచర్ రూ.80,407. 09కోట్లు, 2017-18లో రూ.13,490 కోట్లు క్యాపిటల్ ఎక్స్  పెండే చర్ అయితే, రూ.1,20,630.24కోట్లు. 2018-19లో క్యాపిటల్ ఎక్స్ పెండేచర్ రూ.19,976కోట్లుగా ఉంటే, వెల్ఫేర్ అంటే సంక్షేమా నికి టీడీపీప్రభుత్వం పెట్టిన ఖర్చు రూ.59,871.14కోట్లు. (2019మధ్యలోఎన్నికలుజరిగాయి..

అప్పటివరకుపెట్టినఖర్చుకూడాకలిపి) టీడీపీ ప్రభుత్వంలో మొత్తంగా ఐదేళ్లలో సంక్షేమానికి పెట్టిన ఖర్చు రూ.3లక్షల83వేల764.48కోట్లు. (అంటే సుమారు రూ.4లక్షలకోట్లు) చంద్రబాబునాయుడి హాయాంలో అయిన  క్యాపిటల్ ఎక్స్ పెండేచర్ రూ.74,226కోట్లుగా ఉంది. టీడీపీ ప్రభుత్వం సంక్షేమానికి మొత్తం ఐదేళ్లలో రూ.4లక్షలకోట్లు ఖర్చు చేస్తే, వైసీపీప్రభుత్వం ఈ రెండున్నరేళ్లలో పెట్టినఖర్చు కేవలం రూ.లక్షా05వేలకోట్లు మాత్రమే. అదీ ప్రజలసంక్షేమం విషయంలో చంద్రబాబుకి, జగన్మోహన్ రెడ్డికి ఉన్నతేడా. 

వైసీపీప్రభుత్వంలో 2019-20లోరూ.12,242కోట్లు క్యాపిటల్ ఎక్స్ పెండేచర్ అయితే, సంక్షేమానికి పెట్టినఖర్చు రూ.59,914కోట్లు.  ఇక 2020-21లో క్యాపిటల్ఎక్స్ పెండేచర్ రూ.18,975కోట్లు అయితే, రూ.70,247కోట్లు సంక్షేమానికి పెట్టినఖర్చు. మొత్తం కలిపితే, రూ.లక్షా30వేలకోట్లు వైసీపీప్రభుత్వం సంక్షేమానికి ఖర్చుపెట్టింది. (బడ్జెట్ లెక్కల్లోమాత్రం రూ.లక్షా05వేలకోట్లు అనిచెప్పారు.) రెండేళ్లకాలంలో వైసీపీప్రభుత్వానికి వచ్చిన ఆదాయమెంతా అంటే రూ.3లక్షల28వేల442.57కోట్లు. (దానికి సంబంధించిన రసీదులుకూడాఉన్నాయి).

5ఏళ్లలో చంద్రబాబు నాయుడుగారు రూ.4లక్షలకోట్లు ప్రజలసంక్షేమానికి ఖర్చుపెడితే,  జగన్మోహన్ రెడ్డి రెండున్నరేళ్లలో పెట్టినఖర్చు రూ.లక్షా30వేల కోట్లు. ఇప్పుడుచెప్పండిఎవరు సంక్షేమానికి ఎక్కువఖర్చు పెట్టా రో? ఈప్రభుత్వం ప్రజలకుఇస్తున్నది రూపాయి అయితే, ప్రచారా నికి రూ.100లుఖర్చుపెడుతోంది. రూపాయి ప్రచారానికి వంద రూపాయల ప్రచారంచేసుకుంటున్నారు. సొంతపత్రికకు ప్రచారానికి ఎంతఖర్చుపెట్టారో కూడా ప్రజలకు తెలియాలికదా? 

ఈ ప్రభుత్వం గతంలోఉన్న అప్పులను రెండింతలుచేసి చూపిస్తోం ది.  ఉన్నవ్యవస్థలను ఈప్రభుత్వం తనకు అనుకూలంగా మార్చు కొని రేట్లుపెంచి, ఆ రేట్లరూపంలో వచ్చేదాన్నికిక్ బ్యాక్స్ రూపంలో చూపుతోంది. ఉదాహరణకు లిక్కర్ ధర టీడీపీప్రభుత్వంలో రూ.50లుఉంటే, అది ఇప్పుడు రూ.150కి చేరింది. అంటే ఒక్కో సీసాకు రూ.100వరకు అదనంగా వసూలుచేస్తున్నారు. ఆ రూ. 100ఎక్కడికి వెళుతోంది..మద్యంకంపెనీలకుఎంత చెల్లిస్తున్నారో చెప్పాలి. ఆ రకంగా బడ్జెట్లో చూపుతున్న అప్పులను, కిక్ బ్యాక్స్ కిందనొక్కేస్తున్నారు.

అలానే పవర్ (విద్యుత్) కొనుగోళ్లకు పెడుతున్న ఖర్చు. టీడీపీప్రభుత్వంలో యూనిట్ విద్యుత్ ను రూ.3కి, రూ.4కి కొంటే, ఈప్రభుత్వం రూ.20లుపెట్టి కొంటోంది.  విద్యుత్ కొనుగోలుకోసం ఎక్కువధరలు చెల్లిస్తూ, దానిలోకూడా కొంతసొమ్ముని కాజేస్తున్నారు. ఇదిలా ఉంటే, ప్రభుత్వ భవనాలు, పాఠశాలలు, ఇతరత్రా భవనాలకు రంగులపేరుతో రూ.వేలకోట్లు దుర్వినియోగంచేశారు. సెంటు పట్టా భూములపంపిణీ పేరుతో ఎన్ని వేలకోట్లు కాజేశారో కూడా తేలాలి.

ఎకరం రూ.10లక్షలు విలువచేసే భూమిని రూ.40లక్షలకుకొన్నారు. అలా కాజేసిన రూ.30లక్షలు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి? ఈ విధంగా చెప్పుకుం టూ పోతే, వైసీపీప్రభుత్వం అమలుచేస్తున్న ప్రతిస్కీమ్ లోనూ స్కామ్ దాగుంది. మద్యం, ఇసుక, ఇళ్లపట్టాలపంపిణీ , విద్యుత్ కొనుగోళ్లు ఇలా అన్నింటిలో స్కామే. ఆ విధంగా స్కామ్ జరుగుతోందని చెబితే అర్థరాత్రి పూట ఇళ్లకుపోలీసులు వస్తారు. అలానే అధికారపార్టీ నేతలు కూడా ఏదిపడితే అది మాట్లాడుతున్నారు కదా.

మరి వారికెందుకు నోటీసులివ్వరు? పోలీసులేమో రాష్ట్రంలో గంజాయికి, ఇతర మాదకద్రవ్యాలకు తావేలేదంటారు. మరి ఇతరరాష్ట్రాలపోలీసులు, ఎన్ఐఏ, డీఆర్ఐ వారుఎందుకు రాష్ట్రంలో సోదాలుచేస్తున్నారంటే సమాధానంచెప్పరు. ఉత్తరప్రదేశ్ లో పట్టుబడిన గంజాయిమూలాలుఏపీలో ఉన్నాయని పత్రికల్లోనే వచ్చింది. దానిపై ఏపీ పోలీసులు ఏం చెబుతారు? రాష్ట్రంలో గంజా యి పండిస్తున్నవారిని తామే అరెస్ట్ చేస్తున్నామని కూడా పోలీ సులు చెబుతున్నారు. ఇలా పోలీసులతోనే పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేయిస్తున్నారు. చట్టాలను, రాజ్యాంగాన్ని ఏమార్చేలా ప్రభుత్వమే ఇలా అడ్డదిడ్డంగా వ్యవహరిస్తుంటేఎలా? 

రాష్ట్రప్రభుత్వం చేస్తున్న అప్పులు సంక్షేమానికి కాదు... ఆర్థిక సంక్షోభానికే దారితీయనున్నాయి. సంక్షేమం పేరుతో ఆర్థిక సంక్షో భం సృష్టించి, వేలకోట్లరూపాయలను దారిమళ్లించడమే ప్రభుత్వం చేస్తున్నపని. ఇప్పుడు తానులేవనెత్తిన అంశాలు, చెప్పిన లెక్క లు అవాస్తవాలైతే, ప్రభుత్వమే అసలు వాస్తవాలు బయటపెట్టాలి. తాను ఏపీప్రభుత్వ బడ్జెట్ పుస్తకంలోని లెక్కలు, కేంద్రప్రభుత్వ మిచ్చిన లెక్కలను చెప్పాను.

చంద్రబాబునాయుడి గారి హాయాం లో రాష్ట్రం మిగులు విద్యుత్ లో ఉంటే, ఇప్పుడు విద్యుత్ కొరతలు మిగిలాయి. ఈ విధంగా అన్నిరంగాల్లో సంక్షోభం సృష్టించడమే వైసీపీప్రభుత్వం పనిగా పెట్టుకుంది. అప్పులు దొరక్కపోతే తమకు జీతాలుకూడా రావని ఉద్యోగులే భయపడుతున్నారు. ఇవన్నీ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరిచి భవిష్యత్ లో అప్పులురాకపోతే మనపరిస్థితేమిటి.. ప్రజలకు ఏమిస్తామని ఆలోచిస్తే మంచిది.

ఇప్పటికే చాలామంది  ఆర్థిక మేథావులు రాష్ట్రానికి సుమారు రూ.6లక్షలకోట్ల అప్పుంది అంటున్నారు. ఇంకారెండున్నరేళ్లలో ఈప్రభుత్వం ఎన్ని అప్పులు తెస్తుందో తెలియడంలేదు. అప్పులకోసం భవిష్యత్ లో వచ్చే ఆదాయాన్నికూడా తాకట్టుపెడుతున్నారు. ఒకపక్క మద్యపాన నిషేధమంటూ, మద్యంపైవచ్చే ఆదాయంపై అప్పులు తెస్తున్నారు.

ప్రభుత్వఆస్తులు, భవనాలనుకూడా తాకట్టు పెడుతున్నారు. ప్రభుత్వ ఆస్తులకు ప్రభుత్వం కేవలం కస్టోడియన్ మాత్రమే, యజమాని కాదు. యజమానులైనట్లు భావిస్తూ, ప్రభుత్వ, ప్రజల ఆస్తులను తాకట్టుపెట్టే అధికారం పాలకులకులేదు. చంద్రబాబునా యుడిహాయాంలో ఉద్యోగుల బోనస్ లు అడిగేవారు. ఇప్పుడు జీతాలువస్తే చాలని బోరుమంటున్నారు. భాధ్యతలేకుండా, అజ మాయిషీ లేకుండా ఇష్టమొచ్చినట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోంది.