బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : బుధవారం, 13 అక్టోబరు 2021 (08:32 IST)

ఈ నెల 19న రాష్ట్ర శాసన సభ బిసి సంక్షేమ కమిటీ సమావేశం

ఈ నెల 19న మంగళవారం ఉ.11గం.లకు రాష్ట్ర శాసన సభా వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిటీ అసెంబ్లీలోని కమిటీలో సమావేశం కానుందని రాష్ట్ర శాసన సభ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు తెలిపారు.

జంగా కృష్ణమూర్తి అధ్యక్షులుగా మరో 10మంది సభ్యులతో కూడిన రాష్ట్ర శాసనసభా వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిటీ 19న అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశమై రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పధకాలు అమలు తీరును, బిసి వర్గాలకు అమలు చేస్తున్నరూల్ ఆఫ్ రిజర్వేషన్ల అమలు తీరును ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఇతర అధికారులతో కమిటీ సమీక్షిస్తుందని తెలిపారు.

ఈ నెల 20న రాత్రి రైలులో ఈ కమిటీ తిరుపతి బయలుదేరి వెళ్ళి ఈ నెల 21, 22 తేదీల్లో తిరుపతిలో పర్యటించనుందని ఆయన తెలియజేశారు.