బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (08:37 IST)

ఖాకీ కీచకుడు : మేనకోడలిపై రెండేళ్లుగా అత్యాచారం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఖాకీ కీచకుడు పాశవికంగా ప్రవర్తించాడు. తన మేనకోడలిపై రెండేళ్లుగా అత్యాచారం చేస్తూ వచ్చాడు. శీతలపానీయంలో మత్తు మందు కలిపి అత్యాచారానికి పాల్పడసాగాడు. ఈ దారుణం గురించిన వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, యూపీలోని మీర్జాపూర్ జిల్లాకు చెందిన యువతి.. ఆమె కుటుంబాన్ని.. మామ అయిన ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ 2019 జనవరిలో అలహాబాద్‌లో జరిగిన కుంభమేళా వేడుకలకు పిలిపించాడు. ఈ క్రమంలో యువతిపై కన్నేసిన మామ.. ఓ రోజు హోటల్‌కి తీసుకెళ్లాడు. అక్కడ యువతికి మత్తుమందు కలిపిన కూల్‌ డ్రింక్‌ ఇచ్చి ఆమెపై అత్యాచారం చేశాడు. 
 
ఆ సమయంలో బ్లాక్‌మెయిల్ చేయడానికి ఓ వీడియో కూడా తీశాడని మహిళ ఫిర్యాదులో పేర్కొంది. ఈ వీడియోతో మామ తనను రెండేళ్లు బ్లాక్‌మెయిల్‌ చేస్తూ.. అలహాబాద్, కాన్పూర్‌లో అనేకసార్లు అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె పేర్కొంది. 
 
గర్భవతి అని తెలుసుకున్న అనంతరం గర్భస్రావం కావడానికి ఒక మాత్ర కూడా ఇచ్చాడని ఆమె పేర్కొంది. ఈ క్రమంలో నిందితుడు, అతని కుమారుడు ఆదివారం మళ్లీ కాన్పూర్‌కి పిలిపించి గదికి తీసుకెళ్లారని పేర్కొంది. లైంగికంగా వేధిస్తూ అక్కడ కూడా మరొక వీడియో తీశారని మహిళ పేర్కొంది.
 
ఈ విషయాన్ని చెబితే చంపుతామని తీవ్రంగా కొట్టారని తెలిపింది. చివరకు వారి నుంచి తప్పించుకున్న మహిళ.. పోలీసు హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి నదిలోకి దూకినట్లు మీర్జాపూర్‌ డీసీపీ ప్రమోద్ కుమార్ తెలిపారు. 
 
అక్కడున్న గజ ఈతగాళ్లు, సిబ్బంది సహాయంతో ఆమెను కాపాడినట్లు డీసీపీ తెలిపారు. అనంతరం మహిళ ఫిర్యాదు మేరకు ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్, అతని కుమారుడిపై కేసు నమోదు చేశామని.. తెలిపారు. మహిళకు వైద్య పరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించామని డీసీపీ వెల్లడించారు.