1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శనివారం, 18 నవంబరు 2023 (09:38 IST)

ఉత్తరాఖండ్‌లో ఘోరం.. ఆ రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు - 13 మంది మృతి

car accident
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ వాహనం లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది మృత్యువాతపడ్డారు. అలాగే, గుజరాత్ రాష్ట్రంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడం వల్ల మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. శనివారం జరిగిన ఈ రెండు ప్రమాదాల్లో 13 మంది చనిపోయారు. 
 
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనితాల్ జిల్లాలో ద్విచక్రవాహనాన్ని తప్పించబోయిన ఓ పికప్ వాహనం అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న వారిలో 8 మంది చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు. మృతుల్లో ఆరుగురు ఘటనా స్థలంలోనే చనిపోగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. 
 
కొందరు ప్రయాణికులతో పికప్ వ్యాన్ హల్ద్వానీ ప్రాంతం వైపు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. చీరాఖాన్ - రీతా సాహిహ్ మోటార్ రోడ్డులో ప్రయాణిస్తుండగా, వ్యాన్ డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో అదుపు తప్పి 500 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ప్రమాదం జరిగిన క్షణాల్లోనే అందులోని ప్రయాణికుల అరుపులు విన్న చుట్టుపక్కల గ్రామస్థలు ఘటనాస్థలికి చేరుకోన్నారు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు.