మంగళవారం, 8 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 22 మే 2025 (14:03 IST)

ద్యావుడా!! దేవుడు లాంటి భర్తను బైకు వెనుక కూర్చుని చెప్పుతో కొట్టిన భార్య

wife hits husband with slipper
భర్తను భగవంతుడుగా భావించాలని పెద్దలు చెబుతారు. భర్త చెప్పిన మాటలను తు.చ తప్పకుండా పాటించాలని కూడా అంటారు. ఐతే కలియుగంలో వ్యవహారం కాస్త అటుఇటుగా మారుతోంది అనుకోండి. భర్తలు నిర్వర్తించాల్సిన కర్తవ్యాలను తప్పుతున్నారు. దాన్ని అనుసరించి భార్యలు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
 
తాజాగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో మోటార్ బైకును రోడ్డుపై భర్త స్పీడుగా నడుపుతుండగా వెనుక కూర్చున్న భార్య తన చెప్పుతో భర్తను ముఖంపైన, తలపైన కొడుతూ వెళ్తోంది. ఆమె అలా చెప్పుతో ఉతుకుతున్నా భర్త మాత్రం కోపం లేకుండా దెబ్బలు తింటూనే రోడ్డుపై వాహనం నడుపుతూ వెళ్తున్నాడు. ఇపుడు ఈ వీడియో కాస్త వైరల్ అవుతోంది.