1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 21 మే 2025 (17:58 IST)

పొలిటీషియన్స్‌తో పడుకోమని నా భర్త వేధిస్తున్నాడు: భార్య ఫిర్యాదు

Torture
తన భర్త తనను రాజకీయ నాయకులకు పడక సుఖాన్ని అందివ్వాలంటూ వేధింపులకు గురి చేస్తున్నాడంటూ తమిళనాడులో డీఎంకే పార్టీకి చెందిన నాయకుడి భార్య సంచలన ఆరోపణలు చేసింది. తనను పేరుకే పెళ్లి చేసుకుని మోసం చేసాడని ఆవేదన వ్యక్తం చేసింది.
 
ఆమె వెల్లడించిన వివరాలు ఇలా వున్నాయి. '' నేను కాలేజీకి చదువుకునేందుకు వెళ్తున్న రోజుల్లో అతడు నన్ను ఫాలో అయ్యాడు. తనను ప్రేమించాలంటూ వేధించాడు. వినకపోతే చంపేస్తానని బెదిరించి నా చేతిలోని ఫోన్ లాక్కుని నేలకేసి కొట్టి పగులగొట్టాడు. నేను నాయకుడినని, పోలీసు కేసు పెట్టినా ఎవ్వరూ పట్టించుకోరని అన్నాడు. చెప్పినట్లు వినకపోతే ముక్కలు ముక్కలుగా నరికి నన్ను ఆనవాలు లేకుండా చేస్తానన్నాడు. దీనితో భయపడి అతడికి లొంగిపోయాను. అక్కడ నుంచి నన్ను అనుభవించడమే కాకుండా తన తోటి రాజకీయ నాయకులకు పడకసుఖం ఇవ్వాలంటూ నాపై ఒత్తిడి తెచ్చాడు. నేను ఎదురుతిరగడంతో నన్ను చంపేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాదు... అతడు 20 ఏళ్ల వయసున్న అమ్మాయిలతో పరిచయం పెంచుకుని వారిని రాజకీయ నాయకులకు సప్లై చేస్తుంటాడు" అని సంచలన ఆరోపణలు చేసింది.
 
ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకుడు అరక్కోణంకు చెందిన దేవసేయల్. ఇతడు డిఎంకే యువజన విభాగంలో డిప్యూటీ సెక్రటరీగా పని చేస్తున్నాడు. బాధితురాలు ఆరోపణలు చేయడంతో తక్షణమే అతడిని పార్టీ పదవి నుంచి తొలగిస్తున్నట్లు డీఎంకే వెల్లడించింది. మరోవైపు జాతీయ మహిళా కమిషన్ ఈ కేసును సుమోటాగా స్వీకరించింది.