సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 25 అక్టోబరు 2018 (15:51 IST)

కర్ణాటకలో అరుదైన నాగుపాము.. పడగవిప్పి ఆడితే.. ఎరుపు రంగుతో?

పాములను దేవతలుగా పూజించే సంప్రదాయం దేశంలో వున్న సంగతి తెలిసిందే. విషనాగుల వద్ద మాణిక్యాలు వుంటాయని పెద్దలు చెప్తుంటారు. భారీ విలువ చేసే వస్తువులకు పాములు కాపలా కాస్తాయని పెద్దలు చెప్తుంటారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలో అరుదైన నాగుపాము కనిపించింది. పాము పడగ విప్పి ఆడటంతో.. ఆ పడగ ఎరుపు రంగుతో మెరిసిపోయింది. 
 
ఈ పామును చూసిన శునకం మొరగటం మొదలెట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. పాము పడగ భాగంలో ఎరుపుగా మెరిసే అరుదైన దృశ్యానికి సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. 
 
కర్ణాటకలోని చిక్మగలూరు జిల్లా కొప్పా తాలూకాలోని హోలోమాక్కి గ్రామంలో ఈ పాము కనిపించింది. ఈ పాము వ్యవసాయ భూముల్లో కనిపించింది. ఈ పాము పడగ విప్పి ఆడగా... దాని తల ఎరుపు రంగులో మెరిసిపోయిందని.. ఆ పాముకు దైవ శక్తులున్నాయని.. స్థానికులు చెప్తున్నారు. ఐతే మరికొందరు మాత్రం సూర్యకిరణాలు పాము తలపై పడటంతో ఆ వెలుతురుకు పాము తల మెరిసిందని కొట్టి పారేస్తున్నారు.