సోమవారం, 24 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (08:15 IST)

తనకు ఆడపిల్ల.. ఆమెకు మగబిడ్డ పుట్టాడనీ.. రెండో అంతస్థు భవనం నుంచి...

ఒకరు బాగుంటే.. చూసి జీర్ణించుకోలేని వారు అనేక మంది ఉంటారు. ఇలాంటి కోవకు చెందిన ఓ మహిళ తమ బంధువుల అమ్మాయికి కొడుకు పుట్టాడనీ ఎంతటి దారుణానికి ఒడిగట్టిందో తెలుసా.?

ఒకరు బాగుంటే.. చూసి జీర్ణించుకోలేని వారు అనేక మంది ఉంటారు. ఇలాంటి కోవకు చెందిన ఓ మహిళ తమ బంధువుల అమ్మాయికి కొడుకు పుట్టాడనీ ఎంతటి దారుణానికి ఒడిగట్టిందో తెలుసా.?
 
ఢిల్లీకి చెందిన సరితా యాదవ్ అనే మహిళకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. అయితే, ఆమె బంధువు ఇటీవల ఒక అబ్బాయికి జన్మనిచ్చింది. దీన్ని ఓర్చుకోలేక పోయిన సరితా... 18 రోజుల పసిగుడ్డును రెండస్థుల భవనంపై నుంచి కిందికి విసిరేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ జిల్లాలోని ఓ ఆస్పత్రిలో జరిగింది. 
 
తల్లి శిశువుకు పాలివ్వడానికి ఒక అలారమ్ ఏర్పాటు చేసుకుంది. అలారమ్ మోగగానే తన శిశువు కోసం చూసుకునే సరికి, తన పక్కన ఆ బిడ్డ లేకపోవడంతో విషయం బయట పడింది. దీనికి సంబందిచిన పూర్తి వీడియో ఆసుపత్రి సీసీ కెమెరాలో రికార్డు అయింది.