శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 9 ఆగస్టు 2020 (16:09 IST)

చోరీకి వెళ్లి చిన్నారి జీవితాన్ని చిదిమేసిన ఇంటి దొంగలు

వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. చోరీకి వెళ్ళిన ఇంటి దొంగలు... ఓ చిన్నారి జీవితాన్ని చిదిమేశారు. అంటే.. 12 యేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి తెగబడ్డారు. ఆ తర్వాత ఆమెను హత్య చేసేందుకు ప్రయత్నించి పోలీసులకు చిక్కిపోయారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఢిల్లీకి చెందిన కృష్ణుడు అనే వ్యక్తి మరో నలుగురితో కలిసి దొంగతనాలకు పాల్పడుతూ జీవనం సాగించసాగాడు. 2006లో కృష్ణుడు తన సహచరుల్లో ఒకరితో కలిసి దొంగతనానికని సుల్తాన్‌పురిలోని ఒక ఇంట్లోకి ప్రవేశించాడు. 
 
అప్పుడు ఇంట్లో ఉన్న మహిళ శబ్దం చేయడంతో ఆమెను ఇటుకతో కొట్టి హత్య చేశాడు. ఈ కేసులో కృష్ణను పోలీసులు అరెస్టు చేయగా కోర్టు జీవితఖైదు విధించింది. కానీ జైలు అధికారులు సత్ప్రవర్తన కారణంగా కృష్ణుడిని 2014లోనే విడుదల చేశారు.
 
అయితే, ఆగస్టు 4న కృష్ణుడు దొంగతనం చేయాలనే ఉద్దేశంతో ఓ ఇంట్లోకి ప్రవేశించాడు. అతను ఇంట్లో ఒంటరిగా ఉన్న 12 ఏళ్ల బాలికను చూసి మొదట ఆమెపై లైంగికదాడి చేశాడు. తర్వాత ఆమెను చంపాలని కుట్టు మిషన్‌తో తలపై మోది, పదునైన యంత్రంతో పలుమార్లు దాడి చేశాడు. బాలిక రక్తపు మడుగులో పడిపోవడంతో అమ్మాయి చనిపోయిందని భావించి.. ఇంట్లో దొరికిన రూ.200 తీసుకొని పారిపోయాడు. కానీ, పోలీసులు 48 గంటల్లో మంగోల్‌పురిలో కృష్ణుడిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.