శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 28 జులై 2020 (10:42 IST)

ఉత్తరాదిన భారీ వర్షాలు.. పిడుగుపాటుకు 11 మంది మృతి.. బీహార్‌కు చేదువార్త

పశ్చిమ బెంగాల్‌లో విషాదం చోటు చేసుకుంది. రాష్ట్రలోని మూడు జిల్లాల్లో సోమవారం పిడుగులు పడటంతో 11 మంది మృతి చెందారు, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పిడుగుపాటుకు బంకురా, పూర్బా బర్ధమాన్ జిల్లాల్లో ఐదుగురు మృతిచెందగా, హౌరా జిల్లాలో ఒకరు మరణించినట్లు అధికారులు తెలిపారు. వ్యవపాయ పనులు చేస్తుండగా పిడుగు పడటంతో మృతి చెందినట్లు తెలిపారు.
 
భారీ వరదల కారణంగా అతలాకుతలం అవుతున్న బీహార్‌కు పాట్నా వాతావరణ కేంద్రం మరో చేదు వార్తను అందించింది. ఆగస్టు 1 వరకు ఇంకా ఎక్కువ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ముఖ్యంగా రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతంలో ఆ వరదలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
 
11 జిల్లాల్లోని కొత్త ప్రాంతాలకు వరదనీరు చేరుతుందని దీని వలన మరో మిలియన్ జనాభా ఇబ్బందులు ఎదుర్కొంటుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం హెచ్చరించింది. ఇప్పటికే బీహార్‌లోని 38 జిల్లాల్లో 11 జిల్లాల్లోని  మొత్తం 2.4 మిలియన్ల మంది ప్రజలు వరదలకు గురయ్యారని విపత్తు నిర్వహణ విభాగం పేర్కొంది.
 
అలాగే అస్సాంలో వ‌ర‌ద‌ల ఉధృతి ఇంకా కొన‌సాగుతూనే ఉంది. రాష్ట్రంలో భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల వ‌ల్ల ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారిసంఖ్య 104కు చేరుకుంది. వీరిలో కొండ‌చ‌రియ‌లు విరిగ‌ప‌డి 26 మంది చ‌నిపోయారు. రాష్ట్రంలోని 33 జిల్లాల‌కు గానూ 28 జిల్లాల్లో వ‌రద భీభ‌త్సం సృష్టిస్తోంది. దీంతో దాదాపు 40 ల‌క్ష‌ల‌మంది నిరాశ్ర‌యులు అయ్యారు.