శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 జులై 2020 (10:15 IST)

లడఖ్‌కు కేంద్రం వరాలు - కేంద్ర వర్శిటీ.. బౌద్ధ అధ్యయన కేంద్రం

జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని కల్పించే 370 ఆర్టికల్‌ను ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ సర్కారు రద్దు చేసింది. ఆ తర్వాత లడఖ్ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించింది. అంటే లడఖ్ ఏర్పడి ఒక యేడాది అయింది. 
 
ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఓ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి హోమ్ శాఖ మంత్రి అమిత్ షాతో పాటు విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన లడఖ్‌కు వరాలు కురిపించారు. 
 
లడఖ్‌లో తొలి కేంద్ర విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఓ బౌద్ధ అధ్యయన కేంద్రం ఏర్పాటుకుకానుంది. ఈ యూనివర్శిటీలో ఇంజనీరింగ్, మెడిసిన్ మినహా మిగతా అన్ని బేసిక్ సైన్సెస్ తదితర కోర్సుల్లో డిగ్రీలను అందిస్తుంది. 
 
ఇక ఈ వర్శిటీ ఏర్పాటుపై కేంద్ర మానవ వనరుల శాఖ త్వరలోనే అధికారికంగా ప్రతిపాదన తెస్తుందని, ఆపై క్యాబినెట్ ఆమోదం తర్వాత బిల్లు పార్లమెంట్ మందుకు వస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.