బోనీకపూర్ కుటుంబానికి ఏమైంది?
ప్రముఖ నిర్మాత బోనీకపూర్ కుటుంబానికి ఏమైంది?.. బోనీకపూర్, ఆయన ఇద్దరు కుమార్తెలు జాన్వీ, ఖుషీలతో పాటు ముగ్గురు సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
ఇటీవల బోనీకపూర్ నివాసంలో ముగ్గురు వ్యక్తులకు కరోనా సోకడంతో.. బోనీ, ఆయన ఇద్దరు కుమార్తెలు 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉన్న సంగతి తెలిసిందే.
తాజాగా కరోనా పరీక్షలు నిర్వహించగా మా అందరికీ నెగిటివ్ రోపోర్ట్ వచ్చిందని బోనీ కపూర్ ట్వీట్ చేశారు. మా 14 రోజుల క్వారంటైన్ ముగిసిందని, మరింత కొత్తగా ముందుకు సాగుతున్నామని, కరోనా బారిన పడిన వారంతా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని బోనీ కపూర్ ట్విటర్‌లో తెలిపారు.
ఈ సందర్భంగా కుటుంబసభ్యుల తరపున మహారాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతున్నానని, అందరూ కలిసికట్టుగా కరోనాను ఎదుర్కోవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం బోనీకపూర్ పవన్‌కళ్యాణ్‌తో వకీల్‌సాబ్ సినిమాను నిర్మిస్తున్నారు.