Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

చిన్నారులకు వ్యాక్సిన్ ఎప్పుడు?

Written By ఎం
Updated: శుక్రవారం, 18 డిశెంబరు 2020 (06:27 IST)
ఇటీవల అమెరికాలో అత్యవసర వినియోగానికి ఆమోదం పొందిన ఫైజర్‌ను... ఈ నెల నుండి 16 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కల్గిన వారికి అందిస్తున్నారు. కాగా, 12 సంవత్సరాల లోపు చిన్నారుల విషయంలో మరింత ఆలస్యం అయ్యేటట్లు కనిపిస్తోంది.

ఈ చిన్నారుల్లో అక్టోబర్‌ నుండి వ్యాక్సిన్‌ పరీక్షలు మొదలుపెట్టారు. ఫలితం వచ్చేందుకు చాలా కాలం పట్టే అవకాశం కూడా ఉంది. కాబట్టి...ఈ వయస్సు చిన్నారుల్లో అత్యవసర వినియోగానికి అనుమతిన్విడమన్నదీ ఫుడ్‌ అండ్‌ డ్రగ్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ నిర్ణయించాల్సి ఉంది.

అమెరికాలో అందుబాటులోకి రానున్న మరో వ్యాక్సిన్‌ మోడర్నా. ఇప్పుడు 12 నుండి 17 ఏళ్ల లోపు చిన్నారులపై ప్రయోగాలకు నమోదు ప్రక్రియను ప్రారంభించింది. వారిని ఒక సంవత్సరం పాటు పరిశీలనలో ఉంచుతుంది. 12 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారిపై 2021 నుండి పరీక్షలు చేపట్టనుంది. వచ్చే విద్యా సంవత్సరానికి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయో రావోనన్న అనిశ్చితి నెలకొంది.

కాగా, వృద్ధులపై చేపట్టిన వ్యాక్సిన్‌ ప్రయోగం సానుకూల ఫలితాలు వస్తున్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో చిన్నారులకు అందించవచ్చునని వాండర్‌ బిల్డ్‌ యూనివర్శిటీ చిన్నపిల్లల అంటు వ్యాధి నిపుణుడు డా. బుడ్డీ క్రీచ్‌ తెలిపారు.

కాగా, ఈ వైరస్‌ ఇప్పటి వరకు అత్యధికంగా చిన్నారులకు సోకకపోయినా, వీరి నుండి కరోనా ఇతరులకు సోకే అవకాశముందని...సిన్సినాటి చిల్డ్రన్‌ హాస్పిటల్‌ లో చిన్నారులపై ఫైజర్‌ వ్యాక్సిన్‌ ప్రయోగానికి నేతృత్వం వహిస్తున్న డా. రోబర్ట్‌ ఫ్రీంక్‌ తెలిపారు. సుమారు 1.6 మిలియన్ల మంది పిల్లలు కరోనా బారిన పడ్డారని, 8వేల మంది ఆసుపత్రి పాలయ్యారని, 162 మంది చనిపోయారని తెలిపారు.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments