ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 12 డిశెంబరు 2020 (07:31 IST)

ఈజిప్ట్‌కు చేరిన చైనా వ్యాక్సిన్‌

చైనా ఔషధ దిగ్గజం సీనోఫార్మ్‌ అభివృద్ధి చేసిన కొవిడ్‌-19 టీకా తొలి షిప్‌మెంట్‌ ఈజిప్ట్‌ చేరింది. ఈజిప్ట్‌ మిత్రదేశమైన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) నుంచి ప్రత్యేక విమానంలో దీన్ని రవాణా చేశారు.

ఈజిప్ట్‌ ఆరోగ్య మంత్రి హలా జాయెద్‌, చైనా-యూఏఈ రాయబారులు కైరో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ విమానానికి స్వాగతం పలికారు.

కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న సిబ్బందికి ముందుగా టీకా అందిస్తామని ఆరోగ్యశాఖ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటివరకూ ఈజిప్ట్‌లో సుమారు 1.20 లక్షల కొవిడ్‌ కేసులు నమోదు కాగా, 6,832 మంది మరణించారు.

పది దేశాల్లో సీనోఫార్మ్‌ వ్యాక్సిన్‌ క్లినికల్‌ పరీక్షలు భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ఈ ప్రక్రియ పూర్తికాకముందే... టీకా అత్యవసర వినియోగానికి పలు దేశాలు ఆమోదం తెలిపాయి.

యూఏఈలో నిర్వహించిన క్లినికల్‌ పరీక్షల్లో సీనోఫార్మ్‌ వ్యాక్సిన్‌ 86% ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు నిపుణులు గుర్తించారు.