యువతితో లాడ్జీలో రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య.. చివరికి?
మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తిని పాడుబుద్ధి వదల్లేదు. వివాహేతర సంబంధం అతనిని రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయేలా చేసింది. వివరాల్లోకి వెళితే... గుజరాత్‌కు చెందిన భరత్ సింగ్ సోలంకి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. గతంలో ఆ పార్టీ తరపున మంత్రిగా కూడా పనిచేశాడు.
ఇతను ఇటీవల ఓ యువతితో లాడ్జీలో రాసలీలలు సాగిస్తుండగా, మంత్రి భార్య కాపుకాసి ఇద్దరినీ ఉన్నపళంగా పట్టేసుకుంది. భర్త చేస్తున్న నిర్వాకాన్ని రికార్డు చేసింది. భర్తతో ఉన్న యువతిపై దాడి చేసింది.
భార్య వున్నట్టుండి రూంలోకి రావడంతో షాకయిన మంత్రి.. యువతిని కొడుతున్న భార్యను అతి కష్టం మీద ఆపగలిగాడు. భార్య అక్కడికక్కడే నిలదీయడంతో షాకయ్యాడు.
అంతటితో ఆగకుండా మాజీ మంత్రి చివరకి పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టుకోమని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన క్లిప్పింగ్స్ వైరల్ అవుతున్నాయి.