భార్యను పక్కనబెట్టి.. ప్రియురాలితో లాడ్జిలో రొమాన్స్.. చివరికి షాక్.. ఎలాగంటే?
మానవీయ విలువులు మంటగలిసిపోతున్నాయి. వివాహ సంబంధాలు సన్నగిల్లుతున్నాయి. ఫలితంగా అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. దీంతో నేరాల సంఖ్య కూడా పెరిగిపోతున్నాయి. తాజాగా కట్టుకున్న వారి కళ్ళు తప్పి వేరొకరితో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ రాసలీలల్లో మునిగి తేలుతున్న భర్త గుట్టు రట్టు చేసింది. ప్రభుత్వ ఉద్యోగి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని ఎన్నో రోజుల నుంచి భార్యకు తెలియకుండా రాసలీలలు కొనసాగిస్తున్నాడు.
కానీ చివరికి భార్యకు అనుమానం వచ్చి సరైన సమయం కోసం చూసి చివరికి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. పురూలియా జిల్లాకు చెందిన సుభాష్ అనే ఎక్సైజ్ ఉద్యోగి అదే ప్రాంతానికి చెందిన మహిళను పెళ్లి చేసుకున్నాడు. వారికి ఒక పాప కూడా ఉంది. అయితే గత కొంత కాలం నుంచి సుభాష్ ప్రవర్తనలో మార్పు వచ్చింది.
ఇటీవల తరచూ అసన్సోల్ ప్రాంతానికి ఉద్యోగం పని నిమిత్తం వెళ్లగా అక్కడ మేరీ అనే యువతితో పరిచయం ఏర్పడి ఆమెతో అక్రమ సంబంధానికి తెరలేపాడు. ఇక భర్త ప్రవర్తనలో మార్పుని గమనించిన భార్య అతనికి సరైన బుద్ధి చెప్పాలనుకుంది.
ఇటీవల సుభాష్ తన ప్రియురాలితో కలిసి ఓ లాడ్జిలో ఏకాంతంగా గడుపుతూ రాసలీలల్లో మునిగి తేలుతున్న క్రమంలో... వెంటనే ఎవరో తలుపు బాదారు బయటికి వెళ్లి చూడగా సుభాష్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎదురుగా భార్య నిలబడింది. దీంతో భార్య తన కుటుంబ సభ్యులతో కలిసి భర్తను చితకబాది పోలీసులకు అప్పగించింది.