భార్యతో శృంగారం... వీడియోలు యూట్యూబ్‌లో అప్‌లోడ్

women romance with boss
ఠాగూర్| Last Updated: ఆదివారం, 22 నవంబరు 2020 (15:36 IST)
గుంటూరు జిల్లాకు చెందిన ఓ వివాహితుడు తన భార్య పట్ల వికృతంగా ప్రవర్తించాడు. పడక గదిలో భార్యతో సన్నిహితంగా ఉన్నపుడు రహస్యంగా వీడియోలు తీసి... వాటిని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన ఘటన ఒకటి తాజా వెలుగులోకి వచ్చింది.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరు నగరం ఏటీ అగ్రహారానికి చెందిన ఒక మహిళ తన భర్త వికృత నిర్వాకంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎటువంటి పనులు చేయకుండా, యూట్యూబ్‌లో వీడియోలు అప్‌లోడ్‌ చేసి డబ్బులు సంపాదించాలనుకున్న భర్త, భార్యతో ఏకాంతంగా కలిసి ఉన్న వీడియోలు తీసిన ఘటన వెలుగు చూసింది.

ఈ విషయం తెలుసుకున్న భార్య పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లటంతో దిశా పోలీసుస్టేషన్‌కు విచారణ నిమిత్తం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇప్పటీకే ఐటీ కోర్‌ బృందం ఆ వీడియోలు అప్‌లోడ్‌లను తీసివేసే పనిలో నిమగ్నమైంది.

పోలీసులు యుద్ధప్రాతిపదికన కేసుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎప్పుడు అప్‌లోడ్‌ చేశాడు, ఎన్ని వీడియోలు ఉన్నాయి, యూట్యూబ్‌లో కాకుండా, ఇతరత్రా సామాజిక మాధ్యమాల్లో ఏదైనా అప్‌లోడ్‌ చేశాడా...? అనే కోణంలో విచారణ చేపట్టారు. ఫిర్యాదును స్వయంగా అర్బన్‌ పోలీసు ఉన్నతాధికారి పరిశీలిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :