కానిస్టేబుల్ నుంచి అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్.. ఆమె అదరగొట్టిందిగా..?
మహిళా పోలీస్ అదరగొట్టింది. 76మంది చిన్నారులను రిక్షించింది. దీంతో సోషల్ మీడియాలో ఆమె పట్ల ప్రశంసల వర్షం కురుస్తోంది. వివరాల్లోకి వెళితే.. దేశ రాజధాని ఢిల్లీలో ఒక మహిళా పోలీసు ప్రాణాలకు తెగించి 76 మంది పిల్లలను కాపాడారు. కొత్త ప్రోత్సాహక పథకం కింద దాదాపు మూడు నెలల్లో తప్పిపోయిన 76 మంది పిల్లలను కనుగొన్నారు.
వాయువ్య ఢిల్లీలోని సమాయపూర్ బద్లీ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా ఆమె విధులు నిర్వహిస్తున్నారు. ఆమె పేరు సీమా… దీనితో ఆమెకు అవుట్-ఆఫ్-టర్న్ ప్రమోషన్ ఇచ్చారు. ఇలా తీసుకున్న మొదటి పోలీస్ ఆమెనే.
ఇలా ప్రమోషన్ వచ్చాక ఆమె తప్పిపోయిన 76 మంది పిల్లలను గుర్తించగా… వారిలో 56 మంది 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు కావడం గమనార్హం. ఢిల్లీ నుంచి మాత్రమే కాకుండా పశ్చిమ బెంగాల్, పంజాబ్ సహా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆమె పిల్లలను గుర్తించారు అని పోలీసు కమిషనర్ ఎస్.ఎన్. శ్రీవాస్తవ పేర్కొన్నారు.