శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 3 నవంబరు 2020 (09:04 IST)

రాజకీయాల నుంచి రిటైర్‌ అవుతానేమో!: మాయావతి

రాజకీయ నిష్క్రమణ పై బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందించారు. తన మనసులోని మాటను నర్మగర్భంగా బయటపెట్టారు. రాజకీయాల నుంచి రిటైరవుతానేమోనని వ్యాఖ్యానించారు.

సమాజ్‌వాదీ పార్టీతో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో..ఇటీవల ఆమె బీజేపీకి ఓటువేస్తామని చెప్పిన విషయం తెలిసిందే. బీజేపీ, బీఎస్పీ మధ్య కూటమి ఉండదని, భవిష్యత్తులో ఎప్పుడూ ఇలా జరగదని, మతవర్గ పార్టీతో బీఎస్పీ జతకట్టదని అన్నారు.

సర్వజన సర్వ ధర్మ హితం అన్నది తమ విధానమని, దీనికి బీజేపీ సిద్ధాంతం వ్యతిరేకమని, కులం, మతం,పెట్టుబడి సిద్ధాంతాలు కలిగిన పార్టీతో బీఎస్పీ జోడీ కట్టదని చెప్పారు.