సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 20 డిశెంబరు 2016 (16:24 IST)

బెంగళూరు వైద్యులు నిర్లక్ష్యం.. మహిళకు హెచ్ఐవీ సోకిన రక్తం.. సిబ్బందిపై కేసు

బెంగళూరు సదాశివనగరంలోని ఓ ఆస్పత్రి వైద్యులు దారుణానికి ఒడిగట్టారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన మహిళకు నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులు హెచ్ఐవీ సోకిన రక్తం ఎక్కించారు. ఈ ఘటనపై 14 మంది ఆసుపత్రి సిబ్బ

బెంగళూరు సదాశివనగరంలోని ఓ ఆస్పత్రి వైద్యులు దారుణానికి ఒడిగట్టారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన మహిళకు నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులు హెచ్ఐవీ సోకిన రక్తం ఎక్కించారు. ఈ ఘటనపై 14 మంది ఆసుపత్రి సిబ్బందితో పాటు, ఇన్ చార్జ్ మీద బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
 
వివరాల్లోకి వెళితే, 2014లో ఓ మహిళ అనారోగ్యంతో అడ్మిట్ అయ్యింది. ఆ సమయంలో హెచ్ఐవీ సోకిన (హెచ్ఐవీ పాజిటివ్) వ్యక్తి రక్తం సేకరించిన ఆసుపత్రి సిబ్బంది రక్తపరీక్షలు చెయ్యకుండానే దానిని ఆ మహిళకు ఎక్కించారని ఆరోపణలు ఉన్నాయి. 
 
బెంగళూరు 7వ ఏసీఎంఎం కోర్టును బాధితురాలు ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు సదాశివనగర పోలీసులు ఐపీసీ 120 బి, 320, 336, 338 సెక్షన్ల కింద 14 మంది సిబ్బంది (ఆసుపత్రి) మీద కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నారు. కేసుపై దర్యాప్తు జరుపుతున్నారు.