బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 13 జూన్ 2023 (12:15 IST)

తల్లిని చంపి సూట్‌కేసులో కుక్కి పోలీస్ స్టేషన్‌కు వచ్చింది..

crime scene
బెంగళూరులో ఘోరం జరిగింది. తల్లిని చంపి సూట్‌కేసులో కుక్కి పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చింది.. ఓ కూతురు. నిందితురాలు 39 ఏళ్ల ఫిజియోథెరపిస్ట్. 
 
సూట్‌కేసులో శవాన్ని చూసి పోలీసులు షాకయ్యారు. రోజూ గొడవ పడుతుందనే కోపంతోనే తల్లిని చంపేశానని నిందితురాలు వాంగ్మూలం ఇచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే..  పశ్చిమ బెంగాల్‌కు చెందిన 39 ఏళ్ల మహిళ ఫిజియోథెరపిస్ట్. బెంగళూరులో తల్లితో కలిసి ఓ ఫ్లాట్‌లో నివసిస్తోంది. 
 
తల్లి తనతో రోజూ గొడవ పడుతోందని, అందుకే ఆమెను చంపేశానని ఆమె అంగీకరించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.